తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి కృష్ణ అలనాడు అమ్మాయిల రాకుమారుడిగా ఉండేవారట.. కృష్ణ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లతో చేశారు. కానీ కృష్ణతో ఆ ఒక్క హీరోయిన్ మాత్రం సినిమా చేయాలి అంటే చాలా భయపడేదట. మరి ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎందుకు కృష్ణతో సినిమాలు చేయాలంటే భయపడేదో ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి దూరమై వారం రోజులు అవుతోంది.
Advertisement
also read:సాయిపల్లవి హాస్పిటల్ నిర్మాణం చేయడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?
Advertisement
ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మంచి హీరో దూరమయ్యారని బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కృష్ణ గారి గురించే వార్తలు వస్తున్నాయి.. ఈ తరుణంలోనే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.. కృష్ణ గారికి ఆ హీరోయిన్ తో దగ్గర సంబంధం ఉందట. ఈ కారణంగానే ఆ హీరోయిన్ చాలా రోజుల వరకు కృష్ణ గారితో సినిమాలు చేయాలంటే భయపడేదని సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
మరి ఆ సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయనిర్మల మరియు హీరోయిన్ జయసుధకు చాలా దగ్గర బంధుత్వం ఉందట. విజయనిర్మలకు మేనత్త వరుస అవుతారని రామారావు అన్నారు. అందుకోసమే జయసుధ కృష్ణను చూస్తే భయపడిపోయేదని తెలియజేశారు. అలా కృష్ణతో చాలాకాలం సినిమాలు చేయలేదట. ఆ తర్వాత విజయనిర్మల భయం పోగొట్టి వారిద్దరిని కలిపి సినిమాలు చేయించిందని ఆయన ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.
also read:చిరంజీవి-శ్రీదేవి ఇగో వల్ల.. ఆ సినిమా ఆగిపోయిందా..?