Home » సాయిపల్లవి హాస్పిటల్ నిర్మాణం చేయడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

సాయిపల్లవి హాస్పిటల్ నిర్మాణం చేయడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతము ఉన్న స్టార్ హీరోయిన్లందరిలో సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నాచురల్ స్టార్ గా పేరుపొందిన ఈ అమ్మడు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.. సాయి పల్లవి సినిమా చేస్తుంది అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత తప్పనిసరిగా ఉంటుంది. గ్లామర్ రోల్స్ అస్సలు చేయదు. అలాంటి సాయి పల్లవి తెలుగు,తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక తెలుగులో ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందే వైద్య విద్యను అభ్యసించింది.

Advertisement

also read:చిరంజీవి-శ్రీదేవి ఇగో వల్ల.. ఆ సినిమా ఆగిపోయిందా..?

Advertisement

కానీ సినిమాపై ఉన్న ఆసక్తితో డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అనుకోకుండా ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాంటి సాయి పల్లవి తన నటన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని బిజీ కథనాయకగా మారింది. ఆమె సినిమాలే కాకుండా తన డాక్టర్ వృత్తిని కూడా చేపట్టి పేద ప్రజలకు వైద్య సహాయం అందించాలన్నదే ప్రధాన కోరికట. ఇక అసలు విషయానికి వస్తే సాయి పల్లవి కదా కొంతకాలంగా సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో అంతగా కనిపించడం లేదు.

దీనికి ప్రధాన కారణం ఆమె కోయంబత్తూర్లో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించడానికి స్థలం అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె అభిమానులు సాయి పల్లవి త్వరగా హాస్పిటల్ నిర్మించి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు చేతినిండా సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ హాస్పిటల్ నిర్మించాలనే సంకల్పంతో కాస్త విరామం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె హాస్పిటల్ నిర్మించిన తర్వాత ఈ బాధ్యతలను తన చెల్లికి అప్పగించనున్నారని సమాచారం.

also read:AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్: టెన్త్,ఇంటర్, ఐటిఐతో.. ఎన్ని జాబ్స్ అంటే..?

Visitors Are Also Reading