Home » టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన సూప‌ర్ హిట్ కాంబోలు ఇవే..!

టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన సూప‌ర్ హిట్ కాంబోలు ఇవే..!

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంత‌మంది ద‌ర్శ‌కులు హీరోల కాంబో అదిరిపోయేలా ఉంటుంది. వారి కాంబో వ‌చ్చిన సినిమా సూప‌ర్ హిట్ అవ్వాల్సిందే. అలా హ్యాట్రిక్ కొట్టిన కాంబోలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా వ‌చ్చిన బాల‌య్య అఖండ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే బాల‌య్య బోయ‌పాటి కాంబో లో వ‌చ్చిన సింహా లెజెండ్ చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. అలా ఇండ‌స్ట్రీలో హాట్రిక్ కొట్టిన కాంబోలు ఏవో ఇప్పుడు చూద్దాం.

raviteja purijagannath

raviteja purijagannath

పూరీజ‌గ‌న్నాత్ ర‌వితేజ కాంబో వ‌చ్చిన మూడు సినిమాలు మంచి విజ‌యం సాధించి ఈ కాంబో హాట్రిక్ కొట్టింది. వీరి కాంబోలో వ‌చ్చిన ఇట్లు శ్రావ‌ణి సుభ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్. అమ్మానాన్న ఓ త‌మిళ‌మ్మాయి చిత్రాలు మంచి విజయం సాధించాయి.

Advertisement

prabhas rajamouli

prabhas rajamouli

ద‌ర్శ‌కధీరుడు జ‌క్క‌న్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబో కూడా హాట్రిక్ కొట్టింది. వీరి కాంబోలో వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి, బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి పార్ట్ -2 మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి.

Advertisement

v v vinayak ntr

v v vinayak ntr

ఎన్టీఆర్ వివి వినాయ‌క్ ల‌ది కూడా హిట్ కాంబినేష‌నే. వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆది, సాంద‌, అదుర్స్ చిత్రాలు అదుర్స్ అనిపించాయి.

allu arjun trivikram

allu arjun trivikram

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అల్లుర్జున్ కాంబోకు ప్ర‌త్యేక క్రేజ్ ఉంటుంది. వీరి కాంబోలో వ‌చ్చిన‌న జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పురంలో సినిమాలు సూప‌ర్ హిట్ లు గా నిలిచాయి.

balayya b gopal movie

balayya b gopal movie

బాల‌య్య‌కు ఇప్పుడు బోయపాటి ఎలాగో ఒక‌ప్పుడు బిగోపాల్ కూడా అలాగే…వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన లారీ డ్రైవ‌ర్,రౌడీ ఇన్ స్పెక్ట‌ర్, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహనాయుడు సినిమాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి.

Visitors Are Also Reading