Home » రూమ్ నుంచి గెంటేసిన ఓనర్.. సునీల్, త్రివిక్రమ్ 28రూ” కన్నీటి గాధ..!!

రూమ్ నుంచి గెంటేసిన ఓనర్.. సునీల్, త్రివిక్రమ్ 28రూ” కన్నీటి గాధ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సునీల్ త్రివిక్రమ్ సినిమా కెరియర్ ప్రారంభంలో ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవారు. ఇద్దరు కలిసి అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు. సునీల్ కెరియర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పాపే నా ప్రాణం సినిమాలో కూడా నటించాడు. కానీ సునీల్ కు మంచి గుర్తింపుని ఇచ్చింది చిరునవ్వుతో, నువ్వే కావాలి చిత్రాలు మాత్రమే. ఈ సినిమాలకు రైటర్ గా పని చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వేతో స్టార్ కమెడియన్ గా మారారు సునీల్. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇద్దరి జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది. ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి సునీల్ కు త్రివిక్రమ్ తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ వచ్చాడు.

Advertisement

అయితే వీరిద్దరూ సినిమా ఆఫర్ల కోసం తిరుగుతున్న సమయంలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుందట. వీరిద్దరూ లకిడికపూల్ లో చిన్న రూమ్ లో అద్దెకు ఉండేవారు. అప్పటికి మూడు నెలలు గడిచింది. చేతిలో రూపాయి కూడా లేదు. ఓనర్ అద్దె కోసం వచ్చాడు. సునీల్ త్రివిక్రమ్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అద్దె కట్టే పరిస్థితి లేకపోవడంతో రూమ్ ఖాళీ చేయాలని అన్నారు ఇంటి ఓనర్. ఆ టైంలో సునీల్ దగ్గర రూపాయి లేదు త్రివిక్రమ్ దగ్గర 30 రూపాయలు ఉన్నాయి. ఆ టెన్షన్ లో వెంటనే వెళ్లి రెండు సిగరెట్లు కొనుక్కొని కాల్చాడు త్రివిక్రమ్. ఈ తరుణంలోనే ఆ ఉన్న 28 మరుసటి రోజు ఎలా తినాలో ప్లాన్ చేస్తున్నాడట సునీల్. ఇంతలో త్రివిక్రమ్ మార్కెట్లోకి వచ్చిన రెండు కొత్త కూల్డ్రింక్స్ ను తీసుకొని వచ్చారట.

Advertisement

అవి చూసిన సునీల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. రేపటి ఫుడ్ గురించి నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు కూల్ డ్రింక్ తీసుకొచ్చావా అని మనసులో అనుకుంటున్నారట. ఈ విషయాన్ని వెంటనే త్రివిక్రమ్ తో అన్నాడు. దీంతో త్రివిక్రమ్ మాట్లాడిన మాటలకు సునీల్ అవాక్కయ్యారట.. డబ్బు లేదని రేపటి నుంచి ఆలోచించడం దేనికి, ఇప్పటినుంచి ఆలోచిద్దాం రా అని భరోసా ఇచ్చారట. మనిషి భయంతో ఉన్నప్పుడు దారులు ఉన్న కనిపించవు. భయపడడం కంటే ధైర్యంగా ముందడుగు వేస్తే దేనినైనా అధిగమించవచ్చని చెప్పుకొచ్చారంట త్రివిక్రమ్. ఇలా ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమయ్యారు. స్టార్ కమెడియన్ హీరోగా సునీల్ మారిపోయారు.

also read:

Visitors Are Also Reading