Home » ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చిన లిటిల్ మాస్టర్..!

ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చిన లిటిల్ మాస్టర్..!

by Azhar
Ad

భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఎందరో లెజెండ్ క్రికెటర్లలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ముందు వరుసలో ఉంటాడు. తన కాలంలో ఎప్పుడు బ్యాటింగ్ తో వార్తలో నిలిచే గవాస్కర్ ఈ మధ్యే సోషల్ మీడియా కారణంగా నిలుస్తున్నాడు. ఎప్పుడు ఏదో ఒక్క వివాదాస్పద కామెంట్స్ చేసి రచ్చ చేసే గవాస్కర్ ఇప్పుడు ఎవరు ఊహించని ఓ నిర్ణయం తీసుకున్నాడు.

Advertisement

గతంలో తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మళ్ళీ ప్రభుత్వానికే ఇచ్చేసాడు. అసలు ఏం జరిగిందంటే.. 1988 లో అప్పటి మహారాష్ట్రా ప్రభుత్వం క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం గవాస్కర్ కు కొంత భూమిని ఏర్పాటు చేసింది. అయితే 33 ఏళ్ళు అయిన అక్కడ అకాడమీకి సంబంధించిన ఒక్క చిన్న పని కూడా జరగలేదు. దాంతో ఆయన తీరు పై విమర్శలు వచ్చాయి.

Advertisement

గత ఏడాది మహారాష్ట్రా రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్.. నేరుగానే గవాస్కర్ పై అసంతృప్తి వ్యక్తం చేసాడు. 30 ఏళ్ళు దాటినా ఇంకా అకాడమీ నిర్మించకుండా అంత విలువైన భూమిని ఖాళీగా ఉంచితే ఎలా.. అంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వానికే గవాస్కర్ అప్పజెప్పారు దాంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చముషానియంగా మారింది.

ఇవి కూడా చదవండి :

భారత జట్టు వైఫల్యాలకు కారణం అదే..!

కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

Visitors Are Also Reading