ఐపీఎల్ 15 వ సీజన్‌లో ఎనిమిదవ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ముంబైలోని వాంఖడేలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్‌మెన్ పై ఆధిపత్యం చెలాయించారు. అదే సమయంలో కేకేఆర్‌కు మద్దతుగా సుహానా ఖాన్, కింగ్ ఖాన్ కుమార్తె అనన్య పాండే కూడా వాంఖడే చేరుకున్నారు. ఇంతలో పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ షారూఖ్‌ఖాన్ ఔట్ అయ్యాడు.
Advertisement
Advertisement
వెంటనే సుహానా ఖాన్, అనన్య పాండే ఇద్దరూ సంతోషంగా కనిపించారు. చప్పట్లు కొడుతూ ఎగురుతూ సందడి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో137 కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నే విజయం వరిస్తుందని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ఐపీఎల్‌లో ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరొక వైపు షారూఖ్ ఖాన్ ఐదు బంతులు ఆడి సున్నాకే అవుట్ అయ్యాడు. టిమ్ సౌథీ క్యాచ్ అవుట్ చేశాడు.
#AryanKhan, #SuhanaKhan & #AnanyaPanday in the stadium supporting our Knights 💜 #KKR #KKRvsPBKS #KKRHaiTaiyaar #IPL2022 pic.twitter.com/FgfDS5wyA7
— Abhijeet Bhardwaj 🇮🇳 (@srkian_abhijeet) April 1, 2022