ఈటీవీలో గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది ఈ షోను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో వచ్చే కామెడీని చూసి నవ్వుకుంటారు. ఫిబ్రవరి 07, 2013న జబర్దస్త్ షో ప్రారంభం అయింది. జబర్దస్త్ తెలుగు బుల్లితెరపైనే కాకుండా సౌత్ ఇండియా బుల్లితెరపై ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ బుల్లితెర కార్యక్రమానికి ఈ విధంగా రేటింగ్ రాలేదంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
ఓ వైపు గురువారం రోజు జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ రెగ్యులర్‌గా రేటింగ్ వస్తోంది. అలాంటి జబర్దస్త్ కార్యక్రమానికి చిన్నగా రేటింగ్ పడుపోతున్నట్టు సమాచారం. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్‌ల స్కిట్‌లు మిలియన్‌ల కొద్ది అభిమానులు ఎంతో ఆసక్తిగా చూశారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య చాలా తగ్గింది. ఇక హైపర్ ఆది వెళ్లిపోవడంతో పలువురు కమెడియన్స్ వెళ్లిపోవడం విశేషం. దీంతో జబర్దస్త్ గురించి చర్చ జరుగుతుంది. మరొక వైపు జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రారంభంలో రోజా, నాగబాబు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. కాలక్రమేణా నాగబాబు తప్పుకోగా.. మొన్నటి వరకు ఉన్న రోజా తాజాగా ఏపీ మంత్రి కావడంతో జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకుంది. ఇక ఇదే సమయంలో సుడిగాలి సుధీర్ టీమ్ కూడా జబర్దస్త్ షో వదిలి వెళ్లే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
మరొక వైపు సుడిగాలి సుధీర్ టీమ్‌లో వివాదాలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వివాదాల నుంచి జబర్దస్త్‌ను సుడిగాలి సుధీర్ కూడా వీడే అవకాశం ఉందంటూ అభిమానులకు చేదు వార్త వినిపిస్తుంది. ఇక ఆ వార్త అసలు వాస్తవం కాకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, రోజా వెళ్లిపోవడంతో పాటు కొంత మంది కమెడియన్స్ కూడా వీడారు. ఇలాంటి సమయంలో సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోతే పరిస్థితి ఏమిటి అని పలువురు చర్చించుకుంటున్నారు.జబర్దస్త్ టీమ్ ఇప్పటిఏ కొత్త వారిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సుడిగాలి సుధీర్ టీమ్ కూడా జబర్దస్త్‌ను వీడితే మాత్రం కచ్చితంగా మల్లెమాల వారు బజర్దస్త్ షోను మూసివేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయం పడుతున్నారు.
Also Read :
ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువు ఏంటో చెప్పగలరా..!!
Bhala Thandana : డబ్బు కంటే ఆశ చాలా స్ట్రాంగ్ ఎమోషన్