Home » Bhala Thandana : డ‌బ్బు కంటే ఆశ చాలా స్ట్రాంగ్ ఎమోష‌న్

Bhala Thandana : డ‌బ్బు కంటే ఆశ చాలా స్ట్రాంగ్ ఎమోష‌న్

by Anji
Ad

డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్లుతున్న టాలెంటెడ్ హీరో శ్రీ‌విష్ణు. ఇటీవ‌లే అర్జున ఫ‌ల్గుణ చిత్రంలో ప‌రాజ‌యాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా భళాతంద‌నాన అనే చిత్రంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Advertisement

వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. శ్రీ‌విష్ణు స‌ర‌స‌న క్యాథ‌రిన్ థెరిస్సా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్‌లను టీజ‌ర్‌తో ఆస‌క్తి రేపిన మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. శ‌శిరేఖ అనే ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ ఎన్నో క్రైమ్ స్టోరీల‌ను క‌వ‌ర్ చేస్తూ ఎప్పుడూ ప్ర‌మాద‌క‌ర‌మైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు తోడుగా హీరో క‌నిపించాడు. హ‌వాలా కేసులో హీరోనే స‌స్పెక్ట్ గా చూపించారు.

Advertisement

2వేల కోట్ల డ‌బ్బు చుట్టూ హీరో ప‌డుతున్న‌ట్టు మ‌రోప‌క్క ఆ కేసును సాల్వ్ చేసే దిశ‌గా హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న‌ట్టు చూపించారు. చివ‌రిలో ఆశ డ‌బ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోష‌న్ అని శ్రీ‌విష్ణు చెప్పిన డైలాగ్ తో క‌థ మొత్తం డ‌బ్బు చుట్టూ తిరుగుతుంద‌ని చెప్పారు. చివ‌రికీ 2వేల కోట్ల డ‌బ్బు ఎవ‌రికీ ద‌క్కింది..? హీరో నేరాన్ని హీరోయిన్ ఋజువు చేసిందా..? అస‌లు ఆ డ‌బ్బు అంతా ఎవ‌రిదనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. క్రైమ్, మ‌ని, ఎమోష‌న్ చుట్టూ తిరిగే క‌థ డైరెక్ట‌ర్ ట్రైల‌ర్ క‌ట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ బీజీఎం వేరే లెవెల్ అని చెప్ప‌వ‌చ్చు. మొత్తానికి ట్రైల‌ర్‌తోనే ఆస‌క్తిని పెంచారు మేక‌ర్స్‌. మే 06న విడుద‌ల అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో వేచి చూడాలి.

Also Read : 

ఆక‌ర్షిస్తున్న స‌మ్మ‌త‌మే టీజ‌ర్‌..!

Siddharth : పాన్ ఇండియా సినిమా గురించి సిద్దార్థ్ ఏమ‌న్నాడో తెలుసా..?

Visitors Are Also Reading