బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్ చేసే పలు షోలు ప్రతీ ఒక్కటి కూడా సూపర్ హిట్. ఇప్పుడు సినిమాలలో ఎంట్రీ ఇచ్చి హీరోగా చేస్తున్నాడు. అయితే ఆయనకు అభిమానులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ ఓ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనడంలో సందేహమే లేదు. చాలా హంగామా ఉండే సుధీర్ గురించి ఒక ప్రశ్న ఇప్పుడు అభిమానులను వేదిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఢీ ను సూపర్ హిట్.. సూపర్ డూపర్ హిట్ చేసిన ఈ సీజన్‌లో కనిపించడం లేదు.
Advertisement
కేవలం హైపర్ ఆది మాత్రమే ఈ సీజన్‌లో ఉన్నాడు. సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరినీ తొలగించారు. సుడిగాలి సుధీర్ లేకుండానే రష్మీ ఉన్నా వృధా ఇక ఆ విషయం పక్కన పెడితే.. సుధీర్ ను ఢీ నుంచి తొలగించారా లేదా సుధీర్ స్వయంగా తప్పుకున్నాడా అనేది అభిమానులను వేదిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు మల్లెమాల వారు లేదా సుధీర్ చెప్పాలి. వీరిద్దరిలో ఏ ఒక్కరూ ఈ విషయంను చెప్పడం లేదు. ఇటీవల జబర్దస్త్ కామెడీ స్కిట్‌లో సుధీర్ మాట్లాడారు. ఇంకా ఏమి మానేయాలి రా ఇప్పటికే ఢీ మానేశాను అని చెప్పాడు.
Advertisement
సుధీర్ మాటలను బట్టి ఢీ ఆయనే మానేసాడనే అభిప్రాయంకు కొందరూ వచ్చారు. కానీ మల్లెమాల వారు బడ్జెట్‌లో కంట్రోల్ కోసం ఆయనను తొలగించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆ విషయంలో ఒక క్లారిటీ కోసం ఇప్పుడు అభిమానులు జుట్టు పీక్కుంటూ ఉన్నారు. ఒక్కమాట సుడిగాలి సుధీర్ మీడియా ముందుకు నాకు ఢీ చేయడం ఇష్టం అంటూ ప్రకటన చేస్తే ఢీ షోను ఒక ఆట ఆడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సుధీర్ కామెడీని ఎంతగా జనాలు ఎంజాయ్ చేస్తారో ఎవరైనా సుధీర్‌ను అవమానిస్తే అంతే ధీటుగా ప్రతిస్పందిస్తారు. కామెడి స్కిట్‌లో ఎవరు అయినా సుధీర్‌ను విమర్శిస్తే ఏ స్థాయిలో ఆ కమెడియన్‌కు వాయిస్తారో గతంలోనే చూశాం. ఇప్పటికీ బుల్లెట్ భాస్కర్ ఇతర కంటెస్టెంట్స్ సుధీర్‌ను ఏమైనా అనాలంటే కింద బూతులు తిడతారంటూ భయపడతారు. సుధీర్ కూడా మల్లెమాల వారు ఢీ నుంచి తొలగించినట్టు ప్రకటిస్తే కచ్చితంగా అభిమానులు వీరంగమే సృష్టించడం ఖాయం.