ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ గా ఎదిగ లేకపోయారు.. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చిన కొంతకాలానికే స్టార్లుగా ఎదుగుతారు.. ఆ కోవకే చెందింది హీరోయిన్ కృతి శెట్టి.. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొద్ధి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ వంటి సినిమాలతో సూపర్ హిట్ సాధించి ఇండస్ట్రీలోనే కృతి శెట్టి పేరు మార్మోగిపోతోంది. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు అంతగా ఆడకపోయినా తన సినీ కెరీర్ పై ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేదు అని చెప్పవచ్చు.
also read:
Advertisement
తాజాగా వచ్చిన సూపర్ సింగర్ లో గ్రాండ్ ఫినాలే కి కృతి శెట్టి ముఖ్యఅతిథిగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే సుధీర్ మాట్లాడుతూ స్టేజిపై ఉన్న వారిలో పెళ్లి కాని వారు ఒకరు కృతిశెట్టి మరొకరు నేను అని అనేసారు. ఈ క్రమంలోనే కృతి శెట్టికి లైన్ వేస్తున్నావా అని అనసూయ అడగగా, సుధీర్ సిగ్గుపడుతూ ఆ ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. ఆ తర్వాత అనసూయ కృతి శెట్టి కి ఎలాంటి భర్త కావాలో అని అడగగా కృతి శెట్టి ఇలా సమాధానమిచ్చారు. దయా హృదయం కలిగిన వ్యక్తి తనకు భర్తగా కావాలని ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్ కలిగి ఉండాలని ఆమె అన్నారు.
Advertisement
నన్ను బాగా చూసుకోవడమే కాకుండా సపోర్ట్ గా ఉండాలని కామెంట్ చేశారు. ఆ తర్వాత కృతి శెట్టి చాబ్బిగా ఉండే వ్యక్తిని భర్తగా కోరుకుంటున్నానని అన్నారు. సుధీర్ వెంటనే నేను చాబ్బిని కావాలంటే పొట్ట చూడండి అంటూ అనగా, మీరు కొద్ది సేపటి క్రితమే నేను సిక్స్ ప్యాక్ అని చెప్పారు కదా అన్నది కృతి శెట్టి. సిక్స్ ప్యాక్ ఉంటే మాత్రం చాబ్బిగా ఉండకూడదా అన్నాడు సుధీర్. ఈ విధంగా కృతి శెట్టిని పెళ్లి చేసుకోవాలని ఇంప్రెస్ చేయడం ప్రేక్షకులందరికీ నవ్వు తెప్పించింది. ఈ విధంగా సుదీర్ ఏ ప్రోగ్రామ్ చేసినా సరే తగ్గేదే లేదు అంటూ ముందుకు వెళ్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
also read: