Home » రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

by Bunty
Published: Last Updated on
Ad

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో, రాజకీయాల్లో ఏ రంగంలోనైనా తనదైన ముద్ర వేసుకున్నారు. సినీ రంగంలో అయితే అన్నగారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. తాను సినీ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎలా ఎక్కి అంచలంచెలుగా ఎలా ఎదిగారో పలు సందర్భాల్లో చెప్పేవారట. చాలామందికి ఇలా ఉండాలి బ్రదర్ అని సూచించేవారట.

Advertisement

ఎన్టీఆర్ ముఖ్యంగా మనీ+టైమ్=జీవితం అనే ఓ ఫార్ములాను చాలామందికి చెప్పే వారట ఎన్టీఆర్. ఇక సీనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ రాకముందు అలాగే వచ్చిన తర్వాత ఎంతోమంది ఆప్తులు ఉన్నారు. అలాంటి ఒకరిలో చెప్పుకోవాల్సింది బీవి మోహన్ రెడ్డి గురించి. ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి. జాతకాలు చెప్పడంలో దిట్ట. ఆయన అతను కర్నూలు జిల్లాలో చాలా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే మీరు గనక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు… ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పారని ఎన్టీఆర్ కు మోహన్ రెడ్డి చెప్పారట. ఈ విధంగానే ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు. అంతేకాకుండా మోహన్ రెడ్డి మాట వల్లే ఎన్టీఆర్ రెండవ వివాహం కూడా చేసుకున్నాడనే టాక్ ఉంది. రెండో వివాహంతో రాజయోగం పడుతుందని మోహన్ రెడ్డి చెప్పిన కారణంగానే ఎన్టీఆర్ పెళ్లికి ఆసక్తి చూపించినట్టు సమాచారం.

Read Also : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

Visitors Are Also Reading