దక్షిణాదిన సినిమా తారలు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత లాంటివారు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. కానీ మరికొందరు మాత్రం సినిమాల్లో సక్సెస్ అయినా రాజకీయాల్లో మాత్రం ఫ్లాప్ అయ్యారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోయిన స్టార్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1)చిరంజీవి
Advertisement
సామాన్యుడి నుండి మెగాస్టార్ వరకు ఎదిగిన చిరంజీవి సినిమాల్లో సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకే ఒక పెద్ద దిక్కు అయ్యారు. కానీ 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల బరిలో నిలవగా కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆపై రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
2) కమల్ హాసన్
విశ్వనటుడు కమల్ హాసన్ తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. భారతీయుడు లాంటి సినిమా తీసి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ రాణించలేకపోయారు.
3) పవన్ కళ్యాణ్
మెగాస్టార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి, బిజెపిల కు సపోర్ట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పోటీ చేసిన రెండు చోట్లా కూడా పవన్ ఓడిపోయారు. అంతేకాకుండా ఏపీలో జనసేన ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. అయినప్పటికీ అలుపెరుగని విక్రమార్కుడిలా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు.
Advertisement
4) విజయ్ కాంత్
తమిళ హీరో విజయ్ కాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ కాంత్ సక్సెస్ అవ్వలేకపోయారు.
5)విజయశాంతి
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు విజయశాంతి. విజయశాంతి స్టార్ హీరోలకు సమానంగా సినిమాల్లో క్రేజ్ సంపాదించుకుంది. తెలంగాణ మూమెంట్ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ ని స్థాపించింది. కానీ ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్, బిజెపి ఇలా పార్టీలు మారుతూ వచ్చింది కానీ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ అవ్వలేక పోయింది.
6) ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రకాష్ రాజ్ సక్సెస్ కాలేకపోయాడు.
7) రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకునే సమయంలోనే రజనీ అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ విరమించుకున్నారు.
Also read : తగ్గేదే లే అంటూ వార్నర్ బాబాయ్ బ్యాక్…ఫ్యాన్స్ కుషీ..!