సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో రాణించాలని చాలామంది కలలు కంటారు. అలాంటిది అప్పటికే హీరోలుగా.. దర్శక, నిర్మాతలుగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న వారి వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఎందుకు కోరుకుంటారు. కాబట్టి ఎక్కువమంది బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అది కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వచ్చి తమను తాము ప్రూవ్ చేసుకుంటారు. అలా ప్రస్తుతం కొంతమంది ఇది చాలా తక్కువ స్థాయి నుండి ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ లుగా రాణిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
పెళ్ళి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అయితే హీరోగా చేయకముందు విజయ్ దేవరకొండ కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు సైతం చేశాడు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. అష్టా చమ్మా సినిమాతో నాని హీరోగా పరిచయమయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.
Advertisement
కేజిఎఫ్ తో సంచలనాలు సృష్టించిన హీరో యష్. ఈ కన్నడ హీరో కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఇచ్చాడు. మొదట సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఇక కేజిఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఓ వైపు హీరోగా నటిస్తూ మరోవైపు విలన్ గా మెప్పిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ సేతుపతి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగారు.
తమిళ హీరో శివ కార్తికేయన్ టీవీ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. కానీ ఇప్పుడు హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సైతం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట యూట్యూబర్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ALSO READ :
ఎవరికైనా సాయం చేశావా నువ్వు అంటూ చిరంజీవిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట..?
బాహుబలి సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…జక్కన్న మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా …?