Home » బాహుబలి సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…జక్కన్న మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా …?

బాహుబలి సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…జక్కన్న మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా …?

by AJAY
Ad

ఒకప్పుడు సినిమాలు కేవలం థియేటర్లలోనే విడుదలయ్యేవి. ఆ తరువాత చాలా రోజులకు టీవీ లో వచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా విడుదలైన థియేటర్ లో మహా అయితే ఒక వారం రోజులు ఆడి ముందుగా ఓటీటీలోకి వస్తోంది. దాంతో థియేటర్ లో సినిమా చూసేటప్పుడు గమనించని కొన్ని విషయాలు ఓటిటిలో గమనించవచ్చు. దాంతో సినిమాలోని చిన్నచిన్న తప్పులను ప్రేక్షకులు ఈజీగా గుర్తు పడుతున్నారు.

Bahubali part-3

Bahubali 

మరోవైపు ఎప్పుడో వచ్చిన సినిమాలను చూసిన అందులోని మిస్టేక్స్ ను గుర్తుపట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాహుబలి విషయంలోనూ అదే జరిగింది. నిజానికి భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే బాహుబలి ఓ రికార్డు. ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అదేవిధంగా తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది.

Advertisement

Advertisement

బాహుబలి రెండు పార్ట్ లుగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బాహుబలి ఓటిటిలో అందుబాటులో ఉంది. దాంతో ఇప్పుడు ఓ నెటిజన్ తాను బాహుబలిలో ఓ మిస్టేక్ ను గమనించానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…బాహుబలి పార్ట్ 1 లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. శివుడికి ప్రేయసిగా తమన్నా కనిపిస్తుంది.

అయితే ఈ సినిమా మొదట్లోనే తమన్నాతో పచ్చబొట్టేసిన అనే రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అయితే ఈ సాంగ్ లో తమన్నా తన జాకెట్ కు వెనక భాగంలో ఉన్న ముడి విప్పుతున్నట్టు కనిపిస్తుంది. కానీ సాంగ్ ప్రారంభం లో మాత్రం అసలు తమన్నా జాకెట్ వెనకాల ఎలాంటి ముడి కనిపించదు. దాంతో జక్కన్న ఈ సీన్ లో మిస్టేక్ చేసి దొరికిపోయాడు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading