Home » తెలుగులో హవా తగ్గిపోయిన స్టార్ హీరోయిన్లు !

తెలుగులో హవా తగ్గిపోయిన స్టార్ హీరోయిన్లు !

by Bunty
Ad

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి హీరోయిన్స్ ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం ఒకే ఒక్క సినిమాతోనే చాలా పాపులర్ అయ్యి వరుస సినిమాలతో దూసుకుపోయి ఆ తర్వాత ఒక్క సినిమా అవకాశాలు కూడా లేక ఖాళీగా ఉంటున్నారు. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళుతున్నారు. అలా ప్రస్తుతం చేతిలో ఒక్క తెలుగు సినిమా అవకాశాలు కూడా లేకుండా ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# త్రిష

ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష… వర్షం, నువ్వోవస్తానంటే నేనొద్దంటానా, అతడు వంటి సినిమాలలో నటించి మంచి క్రెజ్ తెచ్చుకుంది. దాదాపు స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా అవకాశాలు కూడా లేకుండా ఖాళీగా ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఈ భామ క్రేజ్ ఇప్పుడు కాస్త తగ్గింది.

Advertisement

# ప్రణీత

స్టార్టింగ్ లో ఈమె సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ అత్తారింటికి దారేది సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది ఈ భామ. ఇక ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలలో దూసుకుపోయింది. ఇక బ్రహ్మోత్సవం సినిమాతో మళ్ళీ డీలా పడింది ప్రణీత. దీంతో తెలుగులో సినిమాలు చేయలేదు. ఆ తర్వాత వివాహం, వివాహ అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చింది ప్రణీత.

# ప్రియా ఆనంద్

తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా అనంతరం రామ రామ కృష్ణ కృష్ణ, 180 వంటి సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ రెండు సినిమాల అనంతరం ప్రియ ఆనంద్ కు పెద్దగా తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళ సినిమాల వైపు కు వెళ్ళింది ప్రియా. ఇతర భాషలలో నటించి మంచి క్రేజ్ ను తెచ్చుకుంటుంది.

ఇవి కూడా చదవండి

వరల్డ్ కప్ కి పాక్ కండీషన్…Z కేటగిరీ సెక్యూరిటీ కావాలంటూ పట్టు !

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

వెస్టిండీస్‌తో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్‌!

Visitors Are Also Reading