చిత్ర పరిశ్రమలో సావిత్రి తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. ప్రస్తుతం సౌందర్య మన మధ్యన లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా నటించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన సౌందర్య అన్ని భాషలలో అభిమానులను సొంతం చేసుకున్నారు. సౌందర్య మృతి చెంది 17 ఏళ్లు గడిచిన అభిమానుల హృదయాల్లో మాత్రం ఆమె జీవించే ఉన్నారు. 2004 సంవత్సరంలో విమాన ప్రమాదంలో మృతి చెందారు.
Advertisement
ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌందర్య గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలో తాను నటించకపోవడానికి గల కారణాల గురించి మానవ కోటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని పాత్రలలో నటించాలంటే తనకు భయమని ఆయన వెల్లడించారు. ఔట్ డోర్ షూటింగ్ లు ఎక్కువ రోజులు ఉంటే కూడా తాను ఆ సినిమాలలో నటించేవాడిని కాదని ఆయన పేర్కొన్నారు.
Advertisement
శివ్ శంకర్ సినిమా షూటింగ్ సమయంలో లైట్ మ్యాన్ పైనుంచి సౌందర్య ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ పడ్డారని తెలిపారు. పై నుంచి వచ్చే శబ్దం విని ఆమె పక్కకు వెళ్లారని, 15 అడుగుల నుంచి ఆ వ్యక్తి కింద పడ్డాడని కోటేశ్వరరావు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో మరో రెండు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సౌందర్య చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. సౌందర్య నటించిన చివరి సినిమా శివ్ శంకర్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.
Read also : 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !