సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాల విషయంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. దర్శక నిర్మాతలు కొంతమంది హీరో హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని వారికి తగ్గట్టు కథలు రాస్తూ ఉంటారు. ఈ తరుణంలో కథ పూర్తయిన తర్వాత ఆ హీరో హీరోయిన్ కు ఆ కథ వినిపిస్తే నచ్చక రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉంటాయి.
READ ALSO : పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !
Advertisement
దీంతో ఆ కథను మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటారు. అలాంటిదే చంటి కథ. రవి రాజా పినిశెట్టి డైరెక్షన్ లో వెంకటేష్, మీనా కాంబినేషన్లో వచ్చిన మూవీ చంటి. ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనందరికీ తెలుసు. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పటికే 30 సంవత్సరాలకు పైగానే అయింది. ఇందులో వెంకటేష్ యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
Advertisement
ఇందులో వెంకటేష్, చంటి పాత్రలో అమాయక పల్లెటూరి యువకుడిగా నటిస్తారు. అయితే ఈ చిత్రంలో మొదట హీరో రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట. ఆ టైంలోనే చిన్న తంబి సినిమాను రామానాయుడు చూశారట. ఈ మూవీ రీమేక్ రైట్స్ కేఎస్ రామారావు కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో హీరోగా చేయడానికి ఒప్పించారు. అయితే ఈ మూవీ వెంకటేష్ కూడా బాగా నచ్చడంతో కే.ఎస్ రామారావు రవి రాజా పినిశెట్టి.. వెంకటేష్ హీరోగా పెట్టి చేయాలని చెప్పేశారు. కానీ రవి రాజా పెనిశెట్టి మాత్రం హీరో రాజేంద్రప్రసాద్ కి ఎప్పుడో మాట ఇచ్చాను. చేస్తే అతనితోనే చేస్తానని పట్టు పట్టడంతో, హీరో చిరంజీవి రంగంలోకి దిగి రవి రాజా పినిశెట్టి వెంకటేష్, మీనాలతో ఈ సినిమా తీయించారు.
READ ALSO : టీమిండియా ఓడినా..లంక ప్లేయర్లకు వణుకుపుట్టించిన అక్షర్ పటేల్..రికార్డులే రికార్డులు