Home » బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి ఊహించని గిప్ట్ పంపిన స్టార్ హీరో..!

బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకి ఊహించని గిప్ట్ పంపిన స్టార్ హీరో..!

by Anji
Ad

సాధారణంగా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ గా నిలిచిన సినిమాలలో బేబీ  మూవీ కూడా ఒకటి. సాయి రాజేష్ దశకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రాని కంటే ముందు షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు లైన్ కడుతున్నాయి.


అంతేకాదు.. ఈ భామ మరో తెలుగు హీరోయిన్ శ్రీలీలకు గట్టి పోటీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఓ స్టార్ హీరో వైష్ణవి చైతన్యకు ఊహించని గిఫ్ట్ పంపించారట. ఈ వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదండోయ్..  ఐకాన్ స్టార్  అల్లు అర్జున్.  ఏకంగా 20 లక్షల రూపాయల చెక్   వైష్ణవి చైతన్యకు బన్ని పంపించినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే దీనికి ఒక కారణం ఉందట. అల్లు అర్జున్ ఇన్పుట్స్ తో త్వరలో ఆయన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో వైష్ణవి ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోందట.

Advertisement

Advertisement


ఈ క్రమంలోనే ఆమెకు అడ్వాన్స్ రూపంలో బన్నీ ఈ చెక్ పంపించారని తెలుస్తుంది. ఇక ఆ చెక్ అందుకున్న వైష్ణవి ఆనందంతో పరవశంలో తేలిపోతుందట. వైష్ణవి చైతన్య అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం సినిమాలో హీరోకి చెల్లెలి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె నటించడం బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలి అని, తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading