Home » SSC MTS Recruitment 2023 : 10వ తరగతితో 12,523 ఉద్యోగాలు, నోటిఫికేషన్ వివరాలు ఇవే

SSC MTS Recruitment 2023 : 10వ తరగతితో 12,523 ఉద్యోగాలు, నోటిఫికేషన్ వివరాలు ఇవే

by Bunty
Ad

కేంద్ర సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్,12,523 ఎంటిసి (నాన్ టెక్నికల్), హవల్దార్ పోస్ట్ ల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదవ తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పిడబ్ల్యూబీడి అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Advertisement

Advertisement

ఈ అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష/ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఎప్పుడు 2023 నెలలో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్లు సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. మొత్తం 90 ప్రశ్నలకు 270 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. గంటన్నర సమయంలో పరీక్ష రాయవలసి ఉంటుంది. ప్రశ్నాపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో రెండు విభాగాలు ఉంటాయి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : Hockey World Cup 2023 : హాకీ ప్రపంచ కప్ లో ఇంటి ముఖం పట్టిన టీమిండియా

Visitors Are Also Reading