Home » Hockey World Cup 2023 : హాకీ ప్రపంచ కప్ లో ఇంటి ముఖం పట్టిన టీమిండియా

Hockey World Cup 2023 : హాకీ ప్రపంచ కప్ లో ఇంటి ముఖం పట్టిన టీమిండియా

by Bunty
Ad

ఆదివారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమిపాలైంది. దీంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టీమ్ ఇండియా ప్లేయర్ ఆఖరి నిమిషం వరకు పోరాడిన ఫలితం లేకపోయింది. అంతకుముందు అద్భుతంగా ఆడిన భారత ఆటగాళ్లు మూడు గోల్స్ చేశారు. అయితే కివిస్ కూడా మూడు గోల్స్ చేసి గట్టి పోటీ ఇచ్చింది. భారత ఆటగాళ్లలో లలిత్, వరుణ్, సుఖ్ జీత్ తలో గోల్ చేశారు. కివిస్ కూడా మూడు గోల్స్ చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూట్ అవుట్ కు చేరింది. ఇందులోనూ ఇరుజట్లు 3-3 తో నిలిచాయి. దీంతో సడెన్ డెత్ ఆడించారు.

Advertisement

ఇందులో మొదట ఏ జట్టు ఆదిక్యంలో నిలిస్తే వారే విజయతలుగా నిలుస్తారు. ఈ క్రమంలోనే 5-4 తేడాతో ఆదిక్యం సాధించిన కివీస్, ఈ మ్యాచ్ నేరుగా క్వార్టర్స్ ఫైనల్స్ చేరింది. దీంతో నాలుగున్నర దశాబ్దాల తర్వాత మరోసారి ప్రపంచకప్ ముద్దాడాలి అనుకున్న భారత జట్టు ఆశలు అడియాసలే అయ్యాయి. ఈ మ్యాచ్ లో మొదట భారత జట్టు 3-1 తో ఆదిక్యంతో నిలిచింది. కివిస్ కూడా అంత సులువుగా ఓటమిని అంగీకరించలేదు.

Advertisement

తమకు దక్కిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మెరుపు వేగంతో గోల్స్ చేసింది. తొలి క్వార్టర్ లో అవకాశాలు వచ్చిన రెండు జట్లు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. రెండో క్వార్టర్ లో రెండు జట్లు దూకుడుగా ఆడాయి. 17వ నిమిషంలో లలిత్ తొలిగోల్ చేయడంతో భారత్ ముందంజ వేసింది. తర్వాత కాసేపటికి హర్మన్ ప్రీత్ పిసిని గోల్ కీపర్ అడ్డుకోగా, గాల్లోకి లేచిన బంతిని వేగంగా స్పందించిన సుఖ్ జీత్ నెట్ లోకి పంపాడు. అయితే 28వ నిమిషంలో కివిస్ కూడా గోల్స్ సాధించడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. దీంతో టీమిండియా ఇంటి దారిపట్టింది.

READ ALSO : రిషబ్ పంత్ కోలుకోవాలని, 100 కొబ్బరికాయలు కొట్టిన సూర్య!

Visitors Are Also Reading