విశ్వనటుడు కమల్ హాసన్ నటవారసులరాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటోంది. అయితే స్టార్ హీరో కూతురుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కెరీర్ తొలినాళ్లలో తాను కూడా ఇబ్బందులు ఎదురుకున్నట్టు శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. శృతి హాసన్ మొదట ఓ మైఫ్రెండ్, అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలలో నటించింది.
Advertisement
Advertisement
ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో ఇండస్ట్రీలో తనకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడిందని శృతి హాసన్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన వాయిస్ బాగుండదని సినిమాల్లో సక్సెస్ అవ్వడం కష్టం అని అనేవారని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అందరిలాగే తనకు కూడా కొన్ని బయాలు ఉండేవని చెప్పింది.
ఇండస్ట్రీలో నిలదొక్కకుంటానా లేదా అని చాలా బయపడినట్టు శృతి హాసన్ తెలిపింది. కానీ మూడో సినిమా గబ్బర్ సింగ్ తో అంతా మారిపోయిందని చెప్పింది. ఓవర్ నైట్ స్టార్ గా మారానని ఆ సినిమాతో ఐరన్ లెగ్ అని పిలిచారని చెప్పింది. కానీ వరుస ఫ్లాప్ లు వచ్చినప్పుడు తన వాయిస్ బాగాలేదని హీరోయిన్ గా పనికిరానని కూడా కొంతమంది అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.