యంగ్ హీరోలు ఎప్పుడూ సీనియర్ హీరోయిన్ లకు జోడీగా సినిమాలు చేయరు. కానీ హీరోయిన్ల విషయం మాత్రం అలాంటి రూల్స్ ఉండవు. కెరీర్ తొలి రోజుల్లో కేవలం యంగ్ హీరోల సరసన సినిమాలు చేసినా మెల్లి మెల్లిగా సీనియర్ హీరోలతో కూడా జతకట్టాల్సిందే. లేదంటే ఇండస్ట్రీలో దుకాణం సర్దాల్సిందే. కాబట్టి చాలా మంది హీరోయిన్ లు సినియర్ జూనియర్ అని తేడా లేకుండా ఆఫర్ వచ్చిందంటే సినిమా చేసేస్తారు.
Advertisement
అయితే అలా ఇప్పుడు ఓ హీరోయిన్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు హీరోలతో సినిమాలు చేసి మరో హీరోతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ అచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన శృతి హాసన్. ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ కు జోడీగా గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Advertisement
అంతే కాకుండా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా ఎవడు సినిమాలో కూడా నటించి అలరించింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే బాలయ్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Advertisement
ఇక ఇప్పుడు మెగాస్టార్ 154 సినిమాలో నటించడానికి కూడా శృతిహాసన్ ఓకే చెప్పింది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు హీరో చిరంజీవి ట్విట్టర్ వేధికగా వెల్లడించారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో కూడా శృతిహాసన్ రొమాన్స్ చేస్తే పవన్, చరణ్ తో పాటూ చిరుకు జోడీగా నటించిన ఏకైక హీరోయిన్ గా ప్రత్యక గుర్తింపును తెచ్చుకోనుంది.