అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అభిమానులకు చాలా కనెక్ట్ అయ్యేదట. వీరి కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి.. అన్ని సూపర్ హిట్. అప్పట్లో వీరి కాంబినేషన్ చూసి వీరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అలాంటి అన్న ఎన్టీఆర్ చేసిన “పాతాళభైరవి” సినిమా నృత్య సన్నివేశంలో నటించిన సావిత్రి, ఆయన సరసన తొలి చిత్రం పల్లెటూరులో చేసింది. ఆ తర్వాత “మిస్సమ్మ”, ఇక ఈ చిత్రంతో ఈ జంటకు మంచి గుర్తింపు లభించింది.
Advertisement
also read:SR.NTR తుది శ్వాస వరకు నమ్మిన వ్యక్తి.. ఆయన వల్లే 2 పెళ్లి చేసుకున్నారా..?
ఇక తర్వాత వరుసగా అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ హీరోగా విజయ సంస్థ 1965లో నిర్మించిన “సత్య హరిచంద్ర” మూవీ లో చంద్రమతి వేషానికి ముందుగా సావిత్రి అనుకున్నారు. ఈ విషయం సావిత్రికి చెప్పగానే ఆమె సంతోషంతో ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమెకు తెలిసిన కొంతమంది చంద్రమతి వేషాన్ని ఒప్పుకున్నావట అని ప్రశ్నించారట. అవును ఒక మంచి పాత్ర ఒప్పుకున్నానని సంతోషంగా బదులిచ్చారట సావిత్రి. ఆమెను ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు విజయ సంస్థకు సంబంధించిన వాళ్లే. వాళ్ల మనసులో ఉన్న మాటలు సావిత్రితో అనేశారు.
Advertisement
ఏమ్మా సావిత్రి ఇంతకుముందు చేసిన “జగదేకవీరుడు” చిత్రానికి నువ్వు పనికి రాలేదా, ఆ వేశానికి ఏమో సరోజా దేవి, ఈ వేషం వేయడానికి నువ్వా, పదేళ్ల కుర్రాడి పాత్ర నీతో వేయిస్తారా.. అంటే రొమాం*క్ పాత్రలకు నువ్వు పనికిరావని ముద్ర వేసి, తల్లి పాత్రలకు నిన్ను ప్రమోట్ చేశారన్నమాట అంటూ విజయ సంస్థ మీద ఉన్న కోపాన్ని సావిత్రితో వెలగెక్కారు ఒక వ్యక్తి. కానీ సావిత్రి ఆ విషయం గురించి అంతవరకు ఆలోచించలేదు. ఆ వ్యక్తి చెప్పింది విన్న తర్వాత అది నిజమే అనిపించిందట సావిత్రికి. దీంతో తన నోటికి వచ్చిన ఒక అబద్ధాన్ని చెప్పి సత్యహరిచంద్ర సినిమా నుంచి తప్పుకున్నారు సావిత్రి.
also read: