Home » మహేష్ బాబుకు వ్యతిరేకంగా షారుఖ్ ను నిలబెడుతున్న ఫ్యాన్స్..!

మహేష్ బాబుకు వ్యతిరేకంగా షారుఖ్ ను నిలబెడుతున్న ఫ్యాన్స్..!

by Azhar
Ad
ప్రస్తుతం మన దేశం సినీ పరిశ్రమలో బాలీవుడ్ vs సౌత్ ఇండస్ట్రీ అనేది బాగా నడుస్తుంది. మన సౌత్ సినిమాలు హిందీలో డబ్ అయి మంచి విజయాలు సాధిస్తుండటంతో ఈ వాదన అనేది తెర మీదకు వచ్చింది. దానికి తోడు సుదీప్, అజయ్ దేవగన్ మధ్య జరిగిన భాష వాగ్వాదం కూడా దీనికి మరింత తోడైంది. ఆ తర్వాత ఇప్పుడు మహేష్ బాబు వ్యాఖ్యలు కూడా దీనికి ఊపిరి పోశాయి. తాజాగా మహేష్ మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాలు చేస్తాను. అవి హిందీలో డబ్ అవుతాయి. నేను నేరుగా హిందీ సినిమాలు చేయను. ఎందుకంటే బాలీవుడ్ నన్ను భరించలేదు అని అన్నారు.
దాంతో మహేష్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక దొరికిందే ఛాన్స్ అని బాలీవుడ్ యాక్టర్స్ మహేష్ వ్యాఖ్యలను తప్పుగా ఎత్తి చూపుతూ.. అతని పైన విమర్శలకు దిగారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబుకు వ్యతిరేకంగా బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ ను నిలబెడుతున్నారు. షారుఖ్ గతంలో హాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తెస్తూ… దానిని దీనితో పోల్చుతూ.. ఒక్క ఇండస్ట్రీలో ఎంట్రీ గురించి అడిగినప్పుడు ఇచ్చే సమాధానం ఇది అన్ని అంటున్నారు.
అయితే ఆ షారుఖ్ 14 ఏళ్ళ క్రితంది. షారుఖ్ అంతర్జాతీయ ఈవెంట్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన సమయంలో మీరు హాలీవుడ్ లోకి వస్తారా అనే ప్రశ్నకు.. నాకు అంతగా ఇంగ్లీష్ రాదు. అలాగే నాకు కుంగ్ ఫూ లేదా లాటిన్ సల్సా తెలియదని… అందుకే నేను హాలీవుడ్‌లోకి ప్రవేశించేంత ప్రతిభావంతుడని కాదని భావిస్తున్నానని చెప్పాడు. అలాగే నేను ఇటీవల హాలీవుడ్ సినిమాలు చూశాను, మీరు ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని పిలిచే దానిలో నాకు స్థలం లేదని నేను అనుకుంటున్నాను.. ఎందుకంటే నేను అంతా స్థాయి వాడిని కాను అని షారుఖ్ చెప్పాడు. అయితే అక్కడ షారుఖ్ హాలీవుడ్ ఎంట్రీ గురించి.. మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడిన ఈ రెండు సంఘటనలను పక్కన బెట్టి చూస్తున్నారు అభిమానులు.

Advertisement

Visitors Are Also Reading