Home » పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

by AJAY
Ad

టాలీవుడ్ న‌టి క‌రాటే క‌ల్యాణి రీసెంట్ గా యూట్యూబ‌ర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడిచేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అస‌భ్య‌క‌ర‌మైన ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని ఆరోపిస్తూ క‌రాటే క‌ల్యాణి అత‌డి ఇంటికి వెళ్లి దాడిచేసింది. దాంతో శ్రీకాంత్ రెడ్డి కూడా క‌రాటే క‌ల్యాణిపై చేయిచేసుకున్నారు. ప‌రస్ప‌రం దాడి అనంత‌రం ఒక‌రిపై ఒకరు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వార్త హాట్ టాపిక్ కావ‌డంతో తాజాగా దీనిపై వివాదాస్ప‌ద నటి శ్రీరెడ్డి స్పందించింది.

Advertisement

తాను శ్రీకాంత్ రెడ్డికి స‌పోర్ట్ చేస్తున్నాన‌ని క‌రాటే క‌ల్యాణిని ఏకిపారేసింది. అత‌డు వీడియోలు చేస్తే ఇంటికి వెళ్లి కొట్టే హ‌క్కు నీకెవ‌డిచ్చాడు అంటూ బూతుల‌తో రెచ్చిపోయింది. సినిమాల్లో అవ‌కాశాలు లేక చాలా మంది యూట్యూబ్ ను న‌మ్ముకుని బ్ర‌తుకున్నార‌ని కానీ వాళ్ల‌పై దాడులు చేయ‌డం ఏంట‌ని రెచ్చిపోయింది. తెలుగు ద‌ర్శ‌కులు ఫారెన్ వాళ్ల‌కు ముంబై వాళ్లకు అవ‌కాశాలిస్తార‌ని దాంతో టాలెంట్ ఉన్న తెలుగ‌మ్మాయిలు యూట్యూబ్ ను నమ్ముకున్నార‌ని చెప్పింది.

Advertisement

అలాంటి వాళ్లు ఏదో క‌ష్ట‌ప‌డుతుంటే సంగ‌సంస్క‌ర్త అంటూ నీ పెత్త‌నం ఏంట‌ని ప్ర‌శ్నించింది. పుష్ప సినిమాలో సుకుమార్ అల్లు అర్జున్ ర‌ష్మిక‌ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన సీన్ చేయించాడ‌ని సుకుమార్ ను వెళ్లి కొట్టావా అంటూ ఫైర్ అయ్యింది. టీవీ యాంక‌ర్ లు పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్ ద‌ర్శ‌కుల‌ను వెళ్లి కొట్టావా అంటూ రెచ్చిపోయింది. శ్రీకాంత్ రెడ్డికి త‌ల్లిదండ్రులు లేరని యూట్యూబ్ లో క‌ష్ట‌ప‌డి పేరు సంపాదించుకున్నాడ‌ని అలాంటి వాళ్ల‌పై దాడి చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించింది.

నీ ఏజ్ అయిపోయింది కాబ‌ట్టి ఇలాంటి డ్రామాలు చేస్తున్నావ్…నువ్వు బాబి అంటూ చూపించిన‌ప్పుడు నిన్ను ఎంత‌మంది వ‌చ్చి కొట్టారంటూ ఫైర్ అయ్యింది. క‌రాటే క‌ల్యాణి లాంటి వాళ్ల‌ను పార్టిలో ఉంచుకుంటే బీజేపీకి న‌ష్ట‌మేన‌ని చెప్పింది. తెలంగాణ పోలీసులు స్ట్రిక్ట్ అని వాళ్ల‌పై త‌నకు న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పింది.

ALSO READ :

డైరెక్షన్ రాకపోయినా “శేషు” సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించిందో తెలుసా…!

రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

Visitors Are Also Reading