తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. ఈమె ధమాకా సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు ఒప్పుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు అంతర్జాతీయ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. దాదాపు 9 సినిమాలను ఏకకాలంలో సైన్ చేసిన హీరోయిన్ గా శ్రీలీల రికార్డు క్రియేట్ చేసారు
Advertisement
దాదాపు అందరు టాలీవుడ్ బడా హీరోలతో శ్రీలీల నటిస్తున్నారు. చాలా తక్కువ టైం లో టాలీవుడ్ లో శ్రీలీల విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. శ్రీలీల, రామ్ జంటగా నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీలీల పలు ఆసక్తికర విషయాలనుఆ అభిమానులతో పంచుకున్నారు.
Advertisement
స్కంద సినిమా గురించి మాట్లాడిన శ్రీలీల తన బాల్యం గురించి, తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ గురించి చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే తన తల్లి చెప్పడం వలన భరతనాట్యం నేర్చుకున్నానని తెలిపారు. అలా డాన్స్ పై మక్కువ ఎక్కువైందన్నారు. స్కూల్ లో ఏ ప్రోగ్రాం జరిగినా మొదట నా డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండేదని చెప్పుకొచ్చారు. అంత ఇష్టం ఉన్నా.. మొదటి సినిమాలో డాన్స్ చేసే విషయంలో తడపడ్డానని ఒక్క డాన్స్ కోసం ముప్పై టేక్ లు తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడం వలన నిర్మాతకు ఎక్కువ లాస్ వస్తుందని, అన్ని టేక్ లు తీసుకోవడం గిల్టీ గా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక, సారీ చెబుతూ శేఖర్ మాస్టర్ కి లేఖ రాసానని.. దానికి ఆయన నీ తప్పు ఏమీ లేదు అని చెబుతూ బదులు ఇచ్చారని చెప్పుకొచ్చింది.
మరిన్ని..
మహేష్ బాబు సినీ కెరీర్ లో కాస్త ఇబ్బంది పెట్టిన సన్నివేశం.. ఏకంగా రెండు గంటల పాటు..!
జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?