సీనియర్ మోస్ట్ నటుడు అయినటువంటి అన్న నందమూరి తారకరామారావు నటించిన చిత్రాల్లో వందల సంఖ్యలోనే ఉన్నాయి. సాధారణంగా అన్నగారు నటించిన చిత్రాలు అందరినీ మెప్పించేవిగానే ఉంటాయి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరమే లేదు. ఆయన రౌడీగా నటించినా.. రాముడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా, పిచ్చి పుల్లయ్యగా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో విలీనమైపోతుంటారు. ప్రజలు కూడా అదేవిధంగా ఎన్టీఆర్ సినిమాలు చూసేవారు. అన్నగారికి నచ్చిన సినిమా ఏది అని అడిగితే మాత్రం చెప్పడం చాలా కష్టం.
Also Read : IPL 2022 : పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో కోల్‌కతా బౌలర్
Advertisement
ఆరంభంలో ఆయనకు పిచ్చిపుల్లయ్య సినిమా బాగా నచ్చిందట. ఆ తరువాత ఆయనే స్వయంగా తీసుకున్న శ్రీకృష్ణ పాండవీయం సినిమా నచ్చిందట. ఇలా అన్న ఎన్టీఆర్ గారి టేస్ట్ ఎప్పటికప్పుడు మారిపోయింది. ఎప్పుడు ఎలా మారినా..? అన్నగారికి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలంటే చాలా ఇష్టమట. వాటి కోసం అన్నగారు ఎంతో కష్టపడే వారు. ఇలా నటించిన చిత్రాలను ఆయన తన హిస్టరీ ఆఫ్ ఎన్టీఆర్ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఆయన రాసుకున్న చిత్రం శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సినిమాను బాపు దర్శకత్వంలో తీశారు. ఈ సినిమా పూర్తిగా మహాకవి.. శ్రీనాథుని జీవిత విశేషాల గురించి రాసిన కథ.
Advertisement
ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. కేవలం అన్నగారు శ్రీనాథుడిగా, జయసుధ ఆయన భార్యగా నటించారు. దీనిపై నిర్మాతలు పెద్ద ఎక్స్‌పెక్టెషన్స్ కూడా పెట్టుకున్నారు. అయితే అప్పటికే అన్నగారు నటించిన పౌరాణిక చిత్రాలు హిట్ కావడం.. ప్రసిద్ధ రచయిత రమణల కలయికలో రూపొందించిన చిత్రం కావడంతో భారీ అంచనా వేశారు. ఎన్టీఆర్ సైతం శ్రీనాథుడి చరిత్రను చదివిన తరువాత ఈ సినిమాకు ఒప్పుకున్నారట.
ఆయనే స్వయంగా మేకప్ వేసుకున్నారు. అన్నగారు ప్రాణం పెట్టారు కాబట్టే.. ఈ సినిమా తనకు నచ్చిన సినిమాల్లో పెద్ద చోటు దక్కించుకుందనే స్వయంగా ఎన్టీఆర్ చెప్పడం విశేషం. అనూహ్యంగా తెలుగు ప్రేక్షకుల నాడి మారిపోయిన తరుణంలో ఈ సినిమా పట్టుమని 50 రోజులు కూడా ఆడలేదు. దీంతో ఇది ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్లిపోయింది. అయినా కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు నచ్చిన సినిమా అంటూ పదే పదే శ్రీకృష్ణ పాండవీయం గురించి చెప్పడం గమనార్హం.
Also Read : అలీ రేజా రెండేండ్లు టెలివిజన్ ఇండస్ట్రీకి దూరంగా ఎందుకు ఉన్నారో తెలుసా..?