Home » శ్రీకాంత్ ఊహ ల అందమైన లవ్ స్టోరీ గురించి మీకు తెలియని విషయాలు !

శ్రీకాంత్ ఊహ ల అందమైన లవ్ స్టోరీ గురించి మీకు తెలియని విషయాలు !

by AJAY
Ad

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తన భార్య ఊహతో విడాకులు తీసుకుంటున్నాడు అంటూ నిన్న సోషల్ మీడియాలో వార్తలు చెక్క‌ర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో శ్రీకాంత్ మీడియా ముందుకు వ‌చ్చి క్లారిటీ ఇచ్చారు. గతంలో తను చనిపోయినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయని అన్నారు. కొన్ని వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

Advertisement

నిన్న సతి సమేతంగా అరుణాచలం వెళ్ళిన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. విడాకుల వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలను శ్రీకాంత్ ఖండించారు. తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఇక శ్రీకాంత్ ఊహల విడాకుల వార్తలు వైరల్ అవడంతో వారికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పటి హీరోయిన్ ఊహను శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి ప్రేమలో ఎన్నో ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. ఆమె సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో నటించారు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. అయితే అదే సమయంలో ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. దాంతో శ్రీకాంత్ మద్రాస్ లోని ఊహ ఇంటికి వెళ్లి తాను ఊహను ప్రేమిస్తున్నట్టు పెద్దలకు చెప్పారు. మొదట ఊహ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ తో పెళ్లికి ఒప్పుకోలేదట. కానీ ఆ తర్వాత శ్రీకాంత్ గురించి తెలుసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 1997లో శ్రీకాంత్ ఊహల వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. అప్పటినుండి 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి వార్తలు బయటకు వినిపించలేదు. అలాంటి జంట పై తప్పుడు ప్ర‌చారం జ‌ర‌గ‌టంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

Visitors Are Also Reading