Home » Actor Srikanth: హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా..హీరోయిన్‌ కూడా పనికిరాదు ?

Actor Srikanth: హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా..హీరోయిన్‌ కూడా పనికిరాదు ?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోయిన్స్ అందరి సరసన నటించి అమ్మాయిల కలల రాకుమారుడుగా నిలిచాడు. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.

Srikanth Daughter Medha Photos

శ్రీకాంత్ సినిమాలో హీరోగా నటిస్తున్న సమయంలోనే ప్రముఖ సినీ నటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. శ్రీకాంత్ పెద్దబ్బాయి రోషన్ హీరోగా ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్మల కాన్వెంట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు. శ్రీకాంత్ కూతురు పేరు మేధా.

Advertisement

ఈ అమ్మాయి హీరోయిన్ కి మించిన అందంతో ఉంది. మేధా ఫుట్బాల్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. మేధా బయట ఎక్కడ పెద్దగా కనిపించదు. తన అన్న నటించిన పెళ్లి సందడి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కుటుంబసభ్యులతో కలిసి ఫంక్షన్ కి వచ్చారు. అక్కడ అందరూ చూపు మేధా పైనే పడింది. ఈ అమ్మాయి ఎంతో అందంగా ఉందంటూ, తన తల్లి ఊహాలానే కనిపిస్తుందంటూ వార్తలువచ్చాయి. మరి మేధా సినిమాల్లో నటిస్తుందో లేక ఫుట్బాల్ ప్లేయర్ గా రాణిస్తుందో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading