తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో శ్రీహరి అంటే తెలియని వారు ఉండరు. ఆయన యాక్టింగ్ చూస్తే రియల్ గా చేసినట్టే అనిపిస్తుంది. అలాంటి శ్రీహరి కెరియర్ లో వచ్చినటువంటి చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా స్టార్డం కొనసాగిస్తున్న తరుణంలోనే శ్రీహరి అకాల మరణం చెందడం సినీ ఇండస్ట్రీకి తీరని శోకంగా చెప్పవచ్చు. అలాంటి శ్రీహరి తాను చనిపోతాడని తనకి మూడు నెలల ముందే తెలుసట.. శ్రీహరి మరణంపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ షాకింగ్ విషయాలు బయట పెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
also read:డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !
Advertisement
శ్రీహరి గారికి అనారోగ్యం ఉందని,తాను చనిపోతానని ముందే తెలుసని భరద్వాజ్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి నెమ్మదిగా సినిమాలను కూడా తగ్గించుకుంటూ వచ్చారట. తెలుగులో సత్యమేవ జయతే లాంటి షో శ్రీహరితో చేయాలని అనుకున్నారని కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ షోకు నో చెప్పారని భరద్వాజ వెల్లడించారు. ఆయన తన స్టామినాకు మించి బాడీని కష్టపెట్టారని,దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని ఆయన తెలియజేశారు.
Advertisement
also read:Ravanasura Review : రవితేజ రావణాసుర మూవీ రివ్యూ.. మాస్ మహారాజ్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?
అయితే శ్రీహరి వంగవీటి రంగా ప్రోత్సాహం వల్లే సినిమాల్లోకి వచ్చారని, దాసరి నారాయణరావు ఆయనకు ఛాన్స్ ఇచ్చారని అన్నారు. శ్రీహరికి అందరూ డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చారని ఆయన తెలియజేశారు. ముందుగా ఇ.వి.వి. సత్యనారాయణ శ్రీహరికి మంచి రోల్స్ ఇచ్చారని, ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే శ్రీహరి స్టార్ హీరోగా ఎదిగారని తెలిపారు. ఇంతటి స్టార్ డం వచ్చిన ఆయన మాత్రం చాలా సింపుల్ సిటీగా జనంతో కలిసి పోయే వారని భరద్వాజ తెలియజేశారు.
also read:కేజీఎఫ్ స్టోరీ నుంచి సుకుమార్ ఆ లైన్ లేపేసాడా..? పుష్ప కోసమే..!