Home » యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శ్రీదేవీ మేనకోడలు..ఆ వీడియో సూపర్…!

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శ్రీదేవీ మేనకోడలు..ఆ వీడియో సూపర్…!

by AJAY
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీలోకి హీరోలు…నిర్మాతల వారసులు మాత్రమే ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ల వారసులు కూడా ఇండస్ట్రీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల కూతుళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా ఒకరు. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తన అందాలతో యువత మతి పోగొడుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి మేనకోడలు సైతం నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Sridevi niece shirisha

Sridevi niece shirisha

శ్రీదేవి మేనకోడలు శిరీష ప్రైవేట్ ఆల్బమ్ తో తెరపైకి వచ్చింది. కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో సాగే ఓ లవ్ ట్రాక్ వీడియో లో ఆమె హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో హీరోగా శివాజీ గణేశన్ మనవడు దర్శన్ నటించి అలరించాడు. కొన్ని జనరేషన్ల జంటల ప్రేమ ఇతివృత్తం నేపథ్యంలో ఈ పాటను తెరకెక్కించారు. ఈ ప్రైవేట్ సాంగ్ ను తెలుగులోనూ విడుదల చేశారు.

Advertisement

 

“యదలో మౌనం” అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటకు టాలీవుడ్ యువ సంగీత రచయిత ఆచార్యచారి సాహిత్యం అందించారు. ఈ పాటలో శ్రీదేవి మేనకోడలి అందం మరియు నటన చూస్తుంటే త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కూడా శిరీష ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది.

Visitors Are Also Reading