Home » హీరో నానిపై శ్రీ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

హీరో నానిపై శ్రీ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

by Bunty
Ad

సినిమా టికెట్ల విష‌యంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా టికెట్ రేట్లు పెంచిన కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది.. టికెట్ రేటు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారు అంటూ నాని ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఒక వీడియో ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని రకాల చానల్స్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.. ఆ న్యూస్ చూసినప్పుడు నాకు కూడా కడుపు మంటగా అనిపించింది. అలాంటి వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు హీరో నాని. హీరో నాని గారు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వాక్యాలు చేశారు. అయితే అతను చేసిన వ్యాఖ్యలు కక్షతో చేశాడా, ఎవరైనా రాసిన స్క్రిప్ట్ చదివాడా, లేకపోతే నిజంగా బాధ ఉండి అలా అన్నాడో తెలియడం లేదు.

Advertisement

Advertisement

ఒకవేళ నాని సినిమా థియేటర్స్ విషయంలో అంతలా బాధపడుతూ ఉంటే.. అంతకు ముందు ఒకసారి సినిమా థియేటర్ వారు గురించి నేను ఎందుకు చూడాలి నా మీద పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ బాగుంటే చాలు, నా సినిమాలు పోటీలో విడుదల చేస్తానని థియేటర్ యజమానులను కించపరుస్తూ అతని సినిమాలు ఓటి లో విడుదల చేశారు. ఒకప్పుడు అలా మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం మాత్రం కపట ప్రేమ నటిస్తూ థియేటర్ యజమానులపై ప్రేమకురిపిస్తున్న.

తాను చేసిన వ్యాఖ్యలు మరిచిపోయి మాట్లాడుతున్నారా లేక పోతే ప్రజలను పిచ్చి వారిని చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్క్రిప్ట్, లేదా చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ అర్థం కావడం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం, అలాగే సినీ ఇండస్ట్రీలోనే పలువురు దర్శక నిర్మాతలు కలిసి టికెట్ల విషయంలో ఒక రాజు కి వస్తున్న సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమె తెలిపింది. థియేటర్ యజమానులపై ప్రేమ చూపిస్తున్నా నాని ఇటివలే ఆంధ్ర రాష్ట్రానికి తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ముందుకు వచ్చి నాని ఎం సహాయం చేశాడు అనే నేను అడుగుతున్నా అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఈ విధంగా నాని చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది.

Visitors Are Also Reading