శ్రీలంకలో పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే విషయం అందరికి తెలిసిందే. అక్కడ ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇక ప్రధాని దేశం విడిచి పారిపోవడంతో.. అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే ఇన్ని కష్టాలు ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ కు ఆ దేశం ఆతిధ్యం ఇవాళన్ అనుకుంటుంది. అయితే మాములుగా ఈ ఆసియా కప్ యొక్క ఆతిధ్య హక్కులు అనేవి లంక దగ్గరే ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఈ టోర్నీని లంకలో జరపాలా.. వద్ద అం సందేహంలో పడింది ఆసియా క్రికెట్ కౌన్సిల్.
Advertisement
ఈ తరుణంలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆశ్రయించింది. అక్కడే ఈ టోర్నీ నిర్వహించడం గురించి అడగ్గా.. బంగ్లా బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది అని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మేము ఆసియా కప్ నిర్వహణను వదులుకోము అని శ్రీలంక క్రికెట్ బోర్డు సెక్రటరీ మోహన్ డి సిల్వ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడే శ్రీలంకలోనే ఆసియా కప్ 2022 అనేది జరుగుతుంది అని మేము నమ్ముతూనం. ఈ మధ్యే మేము ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా నిర్వహించం.
Advertisement
అలాగే ఇప్పుడు జరగబోయే పాకిస్థాన్ పర్యటనను కూడా విజయవంతం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానమా లేదు అని మోహన్ డి సిల్వ అన్నారు. అయితే లంక బోర్డు ఎంత చెప్పినా కూడా… మిగిలిన దేశాలకు గాని… ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు గాని కొంచెం అనుమానం అయితే ఉంది. ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు అనేవి పూర్తిగా లేవు. ఆందోళనకారులు చేస్తున్న ఉద్యమం అనేది తారాస్థాయికి చేరింది. మరి ఇటువంటి సమయంలో లంక బోర్డు ఏ మేర ఆటగాళ్లకు రక్షణ అనేది కల్పిస్తుంది అనే ప్రశాం వస్తుంది. ప్రస్తుతం చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ అనేది ఆగస్టు 23న ప్రారంభం కావాలి.
ఇవి కూడా చదవండి :