Ad
శ్రీలంకలో ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం తార స్థాయికి చేరింది. దాంతో మొదట కేవలం ఆందోళనలు మాత్రమే చేసిన లంక ప్రజలు ఇప్పుడు.. హింసాత్మక ఘటనలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధమంత్రి రాజపక్స ఇంటిని కూడా తగబెట్టిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదట ఈ ఆందోళనల కారణంగా నేడు జరపాల్సిన ఓ మీటింగ్ కు వాయిదా వేసింది. ఈ మీటింగ్ లో బోర్డు చేయాల్సిన తదుపరి కార్యక్రమాల గురించి చర్చించాల్సి ఉంది.
కానీ ఆ కార్యక్రమం వాయిదా తర్వాత లంక బోర్డు అధికారి ఒక్కరు మాట్లాడుతూ… అసలు ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ యొక్క శ్రీలంక పర్యటన గురించి చర్చించాలి. కానీ అది జరగలేదు. ఈ మీటింగ్ ను త్వరలోనే యూఏఈలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. అయితే లంకలో ఆందోళనలు భారీ జరుగుతున్నాయి. రాజపక్స ఇంటిని తగలబెట్టడం అందుకు నిదర్శనం. ఈ విషయాన్ని బోర్డు చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ ఏడాది ఇక్కడ జరగాల్సిన ఆసియా కప్ కూడా ఇక్కడ జరపడం కష్టమే.
ఎందుకంటే… మ్యాచ్ ల కంటే మాకు ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది చాలా కష్టం అని చెప్పాలి. అందుకే ఇటువంటి కఠిన నిర్ణయాలు తిసుక్కోవాల్సి వస్తుంది. ఇక ఆసీస్, పాక్ పర్యటనల పైన ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ రెండు జట్లతో జరిగే సిరీస్ లను వేరే తటస్థ వేదికకు తరలించాలా.. లేదా మొత్తం రద్దు చేయాలా అనేది ఇంకా నిర్ణయించలేదు అని లంక బోర్డు అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Advertisement