Home » BIGG BOSS OTT : బిగ్ బాస్ ఓటీటీలోకి మెగాస్టార్ చిన్నకూతురు..?

BIGG BOSS OTT : బిగ్ బాస్ ఓటీటీలోకి మెగాస్టార్ చిన్నకూతురు..?

by AJAY
Ad

త్వరలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభంకానుంది. అయితే ఈ సీజన్ గత సీజన్ల‌ మాదిరిగా కాకుండా ఓటిటిలో ప్రసారం కాబోతుందని ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజ‌న్ 6 కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది.ఇక బిగ్ బాస్ ఓటిటి ప్రతి రోజూ 24 గంటలు ప్రసారం కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓటిటి బిగ్ బాస్ ను ప్రసారం చేస్తుండగా మంచి సక్సెస్ అందుకుంది.

Advertisement

దాంతో తెలుగులోనూ అదే ప్రయోగం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజ‌న్ 6లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలువురు కంటెస్టెంట్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అలా వినిపిస్తున్న వారి పేర్ల‌లో కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఆయన సతీమణితో కలిసి వెళుతున్న‌ట్టు టాక్. అదేవిధంగా టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సిరి హ‌న్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, ట్రాన్స్ జెండర్ చంద్రముఖి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఊహించని వ్యక్తి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాటివి యాజమాన్యం శ్రీజను సంప్రదించింద‌ని భారీ మొత్తాన్ని మాటీవీ ఆఫ‌ర్ చేసింద‌ని టాక్.. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

SREEJA INTO BIGG BOSS OTT

మరోవైపు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణం కొంతం కాలంగా ఈ జంట దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు శ్రీజ రీసెంట్ గా త‌న సోష‌ల్ మీడిమా అకౌంట్ కు భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ పేరును తొల‌గింది కొనిదెల అని యాడ్ చేసుకుంది.

Visitors Are Also Reading