Home » శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. విడాకుల గురించేనా ?

శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ సంచలన పోస్ట్‌.. విడాకుల గురించేనా ?

by Bunty
Ad

Sreeja Husband Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మూడేళ్ల కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్యకాలంలో వార్తలో నిలుస్తున్నాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. మెగా కుటుంబంలో ఒకడిగా ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అదే ఆ కుటుంబం నుంచి బయటికి వస్తే ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాదు.

READ ALSO : Alia Bhatt: బిడ్డకు పాలు ఇస్తూ అలియా.. ఫోటో వైరల్

Advertisement

Sreeja Husband Kalyan Dev

Sreeja Husband Kalyan Dev

మెగా కాంపౌండ్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రేక్షకులు అలాగే ఆదరిస్తారు. మూడేళ్ల కింద చిరంజీవి కుటుంబం నుంచి ఒక కొత్త హీరో వచ్చాడు. ఆయన పేరు కళ్యాణ దేవ్. చిరు చిన్న కూతురు శ్రీజ భర్త ఈయన. పెళ్లి సమయంలోనే కళ్యాణ్ దేవ్ ను చూసి హీరో అవుతాడు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2018లో విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ పెద్ద హీరో కాలేకపోయాడు. ఇదిలా ఉంటే, కళ్యాణ్ దేవ్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఈ మధ్య ఎక్కువగా వార్తలో నిలుస్తున్నాడు. అయితే ఇప్పటివరకు అతడు తన గురించి వస్తున్న పుకార్లపై ఎప్పుడూ నేరుగా స్పందించలేదు.

కానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేస్తూ పరోక్షంగా తన వ్యక్తిగత జీవితం పై స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. తన లేటెస్ట్ ఫోటో షేర్ చేస్తూ ఈ పోస్ట్ కి ఇచ్చిన క్యాప్షన్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘కాస్త ఓపికగా ఉండండి, అన్నింటికీ సమాధానం దొరుకుతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దీని ఉద్దేశం ఏంటని? ఈ పోస్టు వెనక ఆంతర్యం ఏంటి? అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అదే విధంగా త్వరలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా కీలక ప్రకటన రానుందా అంటూ కొందరు ఈ పోస్ట్ పై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

read also ; ‘దృశ్యం2’లో మెరిసిన ఈ నటి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading