Home » ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…!

ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే…!

by Bunty
Ad

 

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఈ అమ్మడు సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ హీరో అయినా తన సినిమాలో శ్రీలలకి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటే ఈ అమ్మడు క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

Advertisement

Advertisement

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల దగ్గర నుంచి మొదలు పెడితే అగ్ర హీరోల సరసన కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ అమ్మడు తన నటన, అమాయకత్వం, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇక రానున్న ఆరు నెలల్లో ఆరు సినిమాలు శ్రీలీలవి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాను నటించిన మొదటి సినిమాలో శ్రీలీల కేవలం ఐదు లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే డిమాండ్ చేసిందట. ఇక ఆ సినిమాకుగాను ఐదు లక్షల రూపాయలు తీసుకున్న శ్రీలీల ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించిన 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. ఇక త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రామ్ స్కంద సినిమాలో 80 నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుందని సమాచారం అందుతుంది. ఇక తాను నటించే సినిమాలలో ఒక సినిమాకి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ఇప్పటికే తన చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత తాను నటించే సినిమాలకి ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిందని సమాచారం.

ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఇక ఒక్కో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటుందట. అంటే ఒక్కో నిమిషానికి 10 లక్షల రూపాయలు తీసుకుంటుంది. అంతేకాకుండా తనకోసం ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు, హోటల్ రూమ్ ఖర్చులు కూడా షాపింగ్ మాల్ యాజమాన్యమే భరించాల్సి వస్తుంది.

Visitors Are Also Reading