తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటులలో ఎన్టీరామారావు కూడా ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటనపై ఉన్న ఆసక్తితో అన్నగారు కష్టపడి సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయనే ప్రతిరోజు సైకిల్ పై వెళ్లి పాలు పోసేవారు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత కెరీర్ ప్రారంభంలో పగలనకరాత్రనక కష్టపడి పైకి వచ్చారు. టాలీవుడ్ లో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. అప్పట్లో అన్నగారితో సినిమా చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ లు దర్శకులు క్యూ కట్టేవారు.
Advertisement
ఎన్టీఆర్ సినిమా వచ్చిదంటే థియేటర్ ల ముందు అభిమానులు లైన్ లో నిలుచునేవారు. సినిమాల్లోనే కాకుండా అన్నగారు రాజకీయాల్లోనూ చెరగని ముద్రవేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తనదైన స్టైల్ లో ప్రచారం చేశారు. ఆయన స్పీచ్ కు థియేటర్ లో విజిల్స్ పడినట్టే పొలిటికల్ సభలలో కూడా చప్పట్లు విజిల్స్ వినిపించేవి.
Advertisement
ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ వ్యాపార ప్రకటనల్లో కూడా నటించేవారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతే కాకుండా ఓ యాడ్ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ అప్పట్లో అశోకా ఆమ్లా అనే హెయిర్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు.
ALSO READ :స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఓ సినిమాలో నటించాడని తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?
ఆ ఆయిల్ బ్రాండ్ మద్రాసు విజయాకెమికల్స్ కంపెనీకి చెందినది. కాగా ఆ బ్రాండ్ ప్రకటన కోసం ఎన్టీఆర్ ఫోటోలను వాడేవారు. ఇక ఆ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.1లక్ష రెమ్యనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ బ్రాండ్ కు సంబంధించి ఎన్టీఆర్ యాడ్ పేపర్ లో రాగా ఆ పేపర్ కటింగ్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ALSO READ :ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?