Home » Sr ఎన్టీఆర్ & అక్కినేని నాగేశ్వరావు గార్లు ఎందుకు నటి జమునని బాన్ చేసారంటే ?

Sr ఎన్టీఆర్ & అక్కినేని నాగేశ్వరావు గార్లు ఎందుకు నటి జమునని బాన్ చేసారంటే ?

by Srilakshmi Bharathi
Ad

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్రావు గార్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి లెజెండ్స్. ఇక సీనియర్ నటి జమునకి ఉన్న ఫాలోయింగ్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి తరంలో వీరి సినిమాలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. వీరి సినిమాలు వస్తున్నాయంటే చాలు థియేటర్లలో సందడి ఉండేది.

Advertisement

ఇక సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్రావు కు కూడా స్పెషల్ బాండింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే.. సీనియర్ నటి జమున కూడా వీరికి జంటగా నటించింది.

అటు ఎన్టీఆర్, ఇటు నాగేశ్వర్రావు తో జమున జంటగా నటించిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి కూడా. అయితే.. నాగేశ్వర్రావు, జమున పెయిర్ కు మాత్రం హిట్ పెయిర్ అన్న టాక్ ఉంది. సావిత్రి ఎన్టీఆర్, జమున నాగేశ్వర్రావు హిట్ పెయిర్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ రెండు హిట్ పెయిర్లు నటించిన సినిమా మిస్సమ్మ. ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకునో లేక టివిలో వస్తేనో కదలకుండా కూర్చుని చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు.

Advertisement

 

అయితే.. ఓసారి నటి జమునతో ఎన్టీఆర్, నాగేశ్వర్రావు ఇద్దరూ సినిమాలు చేయమని తెగేసి చెప్పేశారట. ఆమెతో నటించడం బాన్ చేస్తున్నామని చెప్పారట. కారణం ఏంటంటే.. ఆమె యాటిట్యూడ్ చూపిస్తున్నారని..ఇండస్ట్రీలో తమకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వడం లేదనీ అన్నారట. ఇదే విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో నటి జమునతో ప్రశ్నించగా.. ఒక స్త్రీ తన ఆత్మాభిమానాన్ని ప్రదర్శిస్తే.. పురుషుడు ఈగో హర్ట్ అవుతుందని.. అలా జరిగినప్పుడు పురుషులు ఎలా రియాక్ట్ అవుతారో.. అదే జరిగిందని జమున సమాధానం ఇచ్చారు. జమున ఇచ్చిన సమాధానం పై మీ రియాక్షన్ ఏమిటో కామెంట్స్ లో తెలియచేయండి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading