సీనియర్ ఎన్టీఆర్ రాముడు వేశంలో తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేం. కేవలం రాముడు అనే కాదు. కృష్ణుడు, భీముడు, అర్జునుడు ఇలా ఆయన ఏ పాత్ర చేసినా అద్భుతంగా నటించేవారు. అందులో ఆయన పేరుకు తగ్గ రాముడి పాత్రనైతే ఇక చెప్పలేం. ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. అందుకే కాబోలు సినిమాలో ఆయన దాదాపు 15 నిమిషాల పేర్లు రాముడు అనే టైటిల్ యాడ్ అయ్యే విధంగా ఉంటాయి. అలా రాముడు అనే టైటిల్ తో వచ్చిన ఆయన సినిమాలు ఏవి బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్గిరాముడు
ఎన్టీఆర్ హీరోగా రాముడు అనే పేరుతో వచ్చిన తొలి సినిమా ఇది. 1954 ఆగస్టు 05న శ్రీరాములు నాయుడు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా అగ్గిరాముడు సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో హిట్‌గా నిలిచింది.
Advertisement
శభాష్ రాముడు
సీఎస్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1959 సెప్టెంబర్ 10న విడుదల అయింది. ఫలితం ఇది హిట్‌గానే నిలిచింది.
బండ రాముడు
1959 నవంబర్ 06న పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా బండ రాముడు. ఈ సినిమా మాత్రం యావరేజ్‌గా ఆడింది.
టాక్సీ రాముడు
ఈ సినిమా వి.మధుసూదన్‌రావు దర్శకత్వంలో 1961లో అక్టోబర్ 18న విడుదలైంది. సూపర్ హిట్‌గా నిలిచింది.
టైగర్ రాముడు
ఈ సినిమా సీ.ఎస్.రావు దర్శకత్వంలో 1962 మార్చి 08న విడుదలైంది. సూపర్ హిట్‌గా నిలిచింది.
రాముడు భీముడు
ఈ సినిమా తాపీ చాణిక్య దర్శకత్వంలో 1964 మే 21న విడుదల అయింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
పిడుగు రాముడు
Advertisement
1966 సెప్టెంబర్ 10న బి.విట్టలచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా పిడుగు రాముడు సినిమా విడుదలైంది. ఇది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.
రాముని మించిన రాముడు
ఈ సినిమా ఎం.ఎస్.గోపినాథ్ దర్శకత్వంలో 1975 జూన్ 12న విడుదలైంది. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది.
అడవి రాముడు
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అడవి రాముడు సినిమా 1977లో విడుదలై కనివిని ఎరుగని రీతిలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
డ్రైవర్ రాముడు
మళ్లీ రాముడు అనే పేరుతోనే డ్రైవర్ రాముడు అనే సినిమా మరొకసారి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1979 ఫిబ్రవరి 02న విడుదల అయింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
శృంగార రాముడు
ఈ చిత్రం కె.శంకర్ దర్శకత్వంలో 1979లో నవంబర్ 22న విడుదల అయింది. యావరేజ్ గానే నడిచింది.
ఛాలెంజ్ రాముడు
ఈ సినిమా ఎల్.వీ.ప్రసాద్ దర్శకత్వంలో 1980 జనవరి 12న విడులైంది. సూపర్ హిట్ గా నిలిచింది.
సర్కస్ రాముడు
ఈ సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1980 మార్చి 01న విడుదలైంది. హిట్‌గానే నిలిచింది.
సరదా రాముడు
ఈ సినిమా కె.వాసు దర్శకత్వంలో 1980 నవంబర్ 14న విడుదల అయింది. యావరేజ్‌గా ఆడింది.
కలియుగ రాముడు
ఈ సినిమా కె.బాపయ్య దర్శకత్వంలో 1982లో మార్చి 13 విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ రాముడు పేరు పై ఉన్న 15 సినిమాలలో నటించడం విశేషం.