సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు ప్రేమించుకోవడం ఇప్పటి రోజుల్లోనే కాదు అప్పటి తరంలో కూడా ప్రేమలో మునిగి తేలిన హీరో హీరోయిన్ లు ఉన్నారు. అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే అప్పటి స్టార్ హీరో తెలుగు తేజం ఎన్టీఆర్ కూడా ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించినట్టు అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ కు తమ బంధువుల కూతురు అయిన బసవతారకం గారితో వివాహం జరిగింది.
Advertisement
వీరికి మొత్తం పన్నెండు మంది సంతానం కూడా ఉన్నారు. కాగా సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో ప్రేమలో పడ్డారట. అంతే కాకుండా కృష్ణ కుమారిని ఎన్టీఆర్ వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారట. కాగా తాజాగా ఈ విషయం పై రీసెంట్ గా హీరోయిన్ కృష్ణ కుమారి సోదరి షావుకారి జానకి స్పందించారు.
Advertisement
షావుకారి జానకి మాట్లాడుతూ….అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణ కుమారి ప్రేమలో ఉన్నారంటూ టాక్ వినిపించింది. కానీ అప్పటికే ఎన్టీఆర్ కు పెళ్లై పదకొండు మంది సంతానం ఉన్నారు. కృష్ణకుమారిని ఎన్టీఆర్ పెళ్లి చేసుంటే మా చెల్లి జీవితానికి అంత శ్రేయస్కారం కాదేమో అంటూ వ్యాఖ్యానించారు.
అయితే వాళ్లిద్దరూ విడిపోయారో గొడవ పడ్డారో తెలియదు కానీ కృష్ణకుమారి ఒక్క ఫోన్ కాల్ తో పదిహేడు సినిమాలను క్యాన్సిల్ చేసుకుంది. అంతే కాకుండా కృష్ణ కుమారి పెళ్లి సమయంలో ఓ బడా నిర్మాత తనకు ఫోన్ చేసి మీ చెల్లి పెళ్లి ఆపాలంటూ తనకు చెప్పారని షావుకారి జానకి వెల్లడించారు. ప్రస్తుతం షావుకారి జానకి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.