అన్నగారు ఎన్టీఆర్ సినిమాల్లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పాలు అమ్మే స్థాయి నుండి సినిమా హీరోగా ఎదిగారు. స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రానించారు. కేవలం ఒకేరకమైన పాత్రలకు అతుక్కుపోకుండా అన్ని రకాల పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు లాంటి పౌరానిక పాత్రలలో నటించి ఔరా అనిపించుకున్నారు.
Advertisement
ఆ తరవాత సినిమాలను వదిలి ప్రజాసేవ కోసం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే సీఎం కుర్చీ పై కూర్చున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతోమంది నిర్మాతలతో సినిమాలు చేశారు. నటి నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మాణ సంస్థలో కూడా సినిమాలు చేశారు. లక్ష్మీరాజ్యం స్థాపించిన లక్ష్మీరాజ్యం బ్యానర్ లో మొదటి సినిమా దాసిలో ఎన్టీఆర్ హీరోగా నటించారు.
Advertisement
ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ తో నర్తనశాల సినిమా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా సినిమాలో అర్జునుడి పాత్రతో పాటూ బృహన్నల పాత్ర వేయాలని ఎన్టీఆర్ క లక్ష్మీరాజ్యం చెప్పారు. దాంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు. రెండు రోజల తరవాత తాను నటిస్తానని ఎన్టీఆర్ చెప్పారు. ఆ తరవాత సినిమా మొదలైంది. సినిమాలో బృహన్న పాత్ర ఉత్తరపాత్రకు నాట్యం నేర్పాలి. ఉత్తర పాత్ర కోసం నటి ఎల్ విజయలక్ష్మిని అనుకున్నారు.
దాంతో ఎన్టీఆర్ కు ఈ విషయం తెలిసాక ఎల్ విజయలక్ష్మి మంచి డ్యాన్సర్ ఆమెకు నాట్యం తెలియని ఎన్టీఆర్ నాట్యం నేర్పిచడం ఫన్నీగా లేదా అంటూ కామెంట్ చేశారు. దాంతో నిర్మాతలు ఎలాగైనా మీరు ఆ పాత్ర చేయాల్సిందే అంటూ కోరారు. దాంతో ఎన్టీఆర్ తగ్గేదే లే అని చెప్పి నృత్యకారుడు సత్యం వద్ద రెండు మూడు నెలలు ఆ పాటకు నాట్యం నేర్చుకున్నారు. ప్రతిరోజూ ఉదయం గంట సేపు ఎన్టీఆర్ నాట్యం నేర్చుకున్నారు. సినిమా కోసం ఎన్టీఆర్ నెలల పాటూ డ్యాన్స్ నేర్చుకోవడంతో నిర్మాతలు ఆశ్చర్యపోయారు.