Home » “ఎన్టీఆర్ కాబట్టే అలా అన్నారు..” ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్రెటరీ ఆఫీసర్ నరసయ్య!

“ఎన్టీఆర్ కాబట్టే అలా అన్నారు..” ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్రెటరీ ఆఫీసర్ నరసయ్య!

by Srilakshmi Bharathi
Ad

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. శ్రీ రాముడు, కృష్ణుడిగా నటించిన ఆయన.. రాముడు, కృష్ణుడిని తల్చుకుంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొచ్చేలా ఆ పాత్రలలో జీవించారు. ఇప్పటికీ తెలుగు అభిమానులకు రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీఆర్ రూపమే గుర్తుకు వస్తుంది.

Advertisement

కేవలం హీరో పాత్రలే కాదు.. అన్ని రకాల పాత్రలకు అవలీలగా న్యాయం చెయ్యగలరాయన. పాత్ర ఎటువంటిది అయినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన నైజం. గొప్పింటి బిడ్డగా నటించినా, నిరుపేద కుర్రాడిగా నటించినా ఆ పాత్రలలో ఇమిడిపోవడం ఆయన స్పెషాలిటీ. సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఆయన వ్యక్తిత్వంతో తనదైన ముద్ర వేశారు. ఆయనకు చీఫ్ సెక్రెటరీగా నరసయ్య పని చేసారు. ఆయన వ్యక్తిగతంగా ఎన్టీఆర్ తో కలిసి ఉన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

Advertisement

ఓ సారి తిరుపతిలో ఎన్టీఆర్ కు, దేశ పీఎం కు మధ్య జరిగిన ఓ సంఘటన గురించి నరసయ్య వివరించారు. ఓ సారి ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్నారు. అదే సమయంలో బీమాస్ హోటల్ రైల్వే క్రాస్ గేట్ వద్ద పీఎం ప్రయాణిస్తున్న జీప్ కూడా వస్తోంది. క్రాసింగ్ కి అవతల ఎన్టీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఇద్దరు ఒకేసారి ఎదురు పడితే జనాల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాన్నే నరసయ్య ఎన్టీఆర్ కు తెలియపరిచారు. దానితో, ఆయన పీఎం కోసం ఆగితే తప్పేమి ఉంది? అంటూ కొంత సేపటి వరకు వెయిట్ చేసారు. “ఎన్టీఆర్ కాబట్టే ఆ మాట అనగలిగారని.. అదే మరొకరు అయితే.. నాకేమి సంబంధం ఉంది.. నా రోడ్ షో నేను కొనసాగిస్తాను..” అంటూ ముందుకెళ్ళేవారని.. ఎన్టీఆర్ వ్యక్తిత్వమే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది అని చెప్పుకొచ్చారు.

మరిన్ని..

ముఖం మీద మచ్చలు ఉన్నాయా..? కొబ్బరి నూనె లో దీన్ని కలిపి రాయండి చాలు..!

చాణక్య: ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారా..? అయితే ఈ 4 అలవాటు చేసుకోండి..!

నువ్వులని అస్సలు తీసిపారేయకండి.. వీటితో చాలా లాభాలని పొందవచ్చు..!

Visitors Are Also Reading