Home » సౌంద‌ర్య ప్రొపైల్ పిక్‌పై అంద‌రూ ఆశ్చ‌ర్యం..!

సౌంద‌ర్య ప్రొపైల్ పిక్‌పై అంద‌రూ ఆశ్చ‌ర్యం..!

by Anji
Ad

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో విడాకుల ఛాలెంజ్ న‌డుస్తుందా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుందంటున్నారు ప‌లువురు ప్రేక్ష‌కులు. గ‌త సంవ‌త్స‌రం చివ‌రిలో స్టార్ హీరోయిన్ స‌మంత‌, హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌లు విడాకులు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్‌కు గురి చేసారు. ఆ త‌రువాత అమీర్‌ఖాన్‌-కిర‌ణ్‌రావు జంట కూడా విడిపోయింది. ఇలా ఈ ఏడాది అయినా ఎలాంటి చేదు వార్త‌లు విన‌కూడ‌దు అనుకునే స‌మ‌యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ బాంబు పేల్చాడు.

Rajinikanth - Aishwaryaa and Soundarya

Advertisement

18 సంవ‌త్స‌రాల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తీ ప‌లుకుతున్న‌ట్టు చెప్పాడు. 2004లో ఐశ్వ‌ర్య ర‌జినికాంత్‌ను ప్రేమించిన ధ‌నుష్ పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్లలు క‌లరు. అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ జంట మ‌ధ్య విభేదాలు త‌లెత్తుతున్నాయి. తాజాగా వారు విడిపోతున్న‌ట్టు ట్విట్ చేసాడు. ఈ ఊహించ‌ని ట్వీట్‌తో అభిమానులు అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. అయిఏత వారి మ‌ధ్య విభేదాలు ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్నాయ‌ని, విభేదాలు ఉండేక‌న్నా.. విడిపోవ‌డం బెట‌ర్ అని మ‌రికొంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

rajinikanth

ఈ నేప‌థ్యంలో అక్క‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది చెల్లి సౌంద‌ర్య‌. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు ఐశ్వ‌ర్య‌, సౌంద‌ర్య ఇద్ద‌రు కూతుర్లు. అక్కాచెల్లెల్లు ఎప్పుడు ఒక‌టిగానే ఉంటారు. ఇక అక్క విడాకులు విష‌య‌మై చెల్లి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్‌ను మారుస్తూ అక్క‌ను ఓదార్చింది. తండ్రి ర‌జినికాంత్‌తో చిన్న‌ప్పుడు అక్కాచెల్లెళ్లు క‌లిసి దిగిన ఫోటోను డీపీగా పెట్టుకున్న‌ది సౌంద‌ర్య‌. ప‌లువురు నెటిజ‌న్లు అక్క‌కు స‌పోర్ట్‌గా ఉండ‌మ‌ని చెల్లిని కోరుతున్నారు. ఈ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల‌వుతోంది.

Visitors Are Also Reading