Home » షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

by Anji
Ad

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చాలా కాలం తరువాత పఠాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పుడు అందరి చూపు షారూఖ్ నెక్ట్స్ మూవీ జవాన్ పై ఉంది. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, ప్రియమణి, దీపికా పదుకొణె వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

గత కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో సెన్షేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా షారూఖ్ యాక్టింగ్ అదుర్స్ అని.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదని.. గ్లామర్ రోల్స్ లో మెప్పించింది నయనతార. భారీ యాక్షన్ స్టంట్స్ చేయడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదలైన జవాన్ సినిమాలో స్టార్ హీరో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ లో ఆ హీరోను గుర్తు పట్టేశామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Jawan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ జవాన్ మూవీ ఆ రెండు భాషల్లో  మాత్రమేనా.. - Telugu News | Is shahrukh khan promoting Jawan movie in hindi  tamil languages ​​only | TV9 Telugu

జవాన్ మూవీలో లేడీ సూపర్ స్టార్ సైనికురాలుగా కనిపిస్తోంది. ప్రియమణి సైతం ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. జవాన్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిని గుర్తించారు నెటిజన్లు. విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు జవాన్ ట్రైలర్ లో విజయ్ కనిపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మేకర్స్ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆ పాత్రకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీతో నయన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దీపికా పదుకునే గెస్ట్ రోల్ చేయనుందట. మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తొలిసారిగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ చేస్తున్న సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading