ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాల హవా కనిపిస్తోంది. ఒకప్పుడు దేశమంతటా బాలీవుడ్ హవా కనిపించేది … కానీ ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ను సైతం ఏలుతునాయి. కేవలం నటీనటులకే కాకుండా దర్శక నిర్మాతలకు టెక్నీషియన్లకు సైతం డిమాండ్ పెరిగింది. దాంతో సౌత్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ లకు సైతం ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.
Also Read: మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ కాదా..ప్లాంటేషన్ కి ఎప్పుడు మారారంటే..?
Advertisement
ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ లు సైతం హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ లు పుచ్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు…? ఎవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
చిన్న వయసులోనే ఈ రేంజ్ లో తీసుకోవడం గొప్ప విషయం. అంతేకాకుండా దేశంలోనే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్ రెహమాన్ సైతం 6 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సైతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
Advertisement
Also Read: బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?
ఇక టాలీవుడ్ విషయానికొస్తే టాలీవుడ్ లోని టాప్ సంగీత దర్శకులలో ఒకరు తమన్ ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ కాస్త తగ్గింది… అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం దేవిశ్రీ తగ్గేదెలా అంటున్నాడు.
దేవి శ్రీ ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా హీరోగా మరియు మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ ఎంతో పాపులర్ అయ్యారు. జీవి ప్రకాష్ ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అంతేకాకుండా తన మ్యూజిక్ తో మాయ చేసే సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్… ఈ సంగీత దర్శకుడు ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
Also Read: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?