Home » పాకిస్తాన్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఉత్కంఠ పోరు.. చివ‌రికి సౌత్ ఆఫ్రికా విజ‌యం

పాకిస్తాన్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఉత్కంఠ పోరు.. చివ‌రికి సౌత్ ఆఫ్రికా విజ‌యం

by Anji
Ad

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌తో శుక్ర‌వారం మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆరు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది. చేతిలో రెండు వికెట్లు ఉండ‌గా.. పాకిస్తాన్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ ష‌బ్నిమ్ (3/41) ఐదు బంతుల‌లో మిగిలిన రెండు పాక్ వికెట్లు తీసి త‌మ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.

Advertisement

Advertisement

పాకిస్తాన్ 224 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది. పాక్ 49.5 ఓవ‌ర్ల‌లో 217 ప‌రుగుల వ‌ద్ద ఆలౌట్ అయి ఈ టోర్నీలో వ‌రుస‌గా మూడ‌వ ఓట‌మిని చ‌వి చూసింది. ఓమైమా (65 ; 7 ఫోర్లు), నిదాదార్ (55 ; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచ‌రీలు చేసారు. అంతకు ముందు ద‌క్షిణాఫ్రికా 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 223 ప‌రుగులు సాధించింది. లౌరా ఓల్వార్ట్ (75 ; 10 ఫోర్లు), సునెలూస్ (62 ; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచ‌రీ చేసారు.

Also Read :  Aaron Finch : ఐపీఎల్‌లో లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఆసీస్‌ కెప్టెన్‌..!

Visitors Are Also Reading