ఎన్టీఆర్, జయలలిత లాంటి సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. కానీ చాలా మంది సినీతారలు రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న సినిమా తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. మొదటి సారి ఎన్నికల్లోనే చిరు కొన్ని సీట్లను గెలుచుకున్నారు. కానీ ఆ తరవాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్లారు. ఇక ఆ తరావత రాజకీయాలపై విరక్తితో పొలిటికల్ కెరీర్ కు చిరు స్వస్తి చెప్పారు.
పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం విలీనం సమయంలోనూ ఆయన బాధపడ్డారు. ప్రజాసేవ పై ఉన్న ఆసక్తితో తాను సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. మరోవైపు జనసేన తరపున ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
Advertisement
Also Read: IPL 2022 : కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త జెర్సీని మీరు చూశారా..?
కమల్ హాసన్
కమల్ హాసన్ మక్కల్ మీది మయాం అనే పొలిటికల్ పార్టీని స్థాపించి 2018లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటి వరకూ రెండు సార్లు పోటిచేసినా కమల్ హాసన్ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
ప్రకాష్
ప్రముక టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు సార్లు బెంగుళూరు నుండి పోటీ చేసినా ఆయన గెలవలేదు. చివరికి ప్రకాష్ రాజ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
రజినీకాంత్
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ కు కూడా రాజకీయాలు అచ్చి రాలేదు. రజినీకాంత్ పార్టీ ప్రకటన చేసిన కొద్దిరోజుల తరవాత అనారోగ్యం కారణంగా పార్టీ స్థాపించడం లేదని..రాజకీయాలకు దూరంగానే ఉంటానని సంచలన ప్రకటన చేశారు.
Also Read: సమ్మక్క-సారక్క జాతర వివాదంపై చినజీయర్ స్వామి ఏమన్నారంటే..?