భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును గత మూడేళ్ళుగా నడిపించిన సౌరవ్ గంగూలీ ఈరోజు ఆ పదవి నుండి తప్పుకున్నాడు. అయితే భారత జట్టును ఎంతో సమర్ధవంతంగా నడిపిన దాదా.. అప్పడు జట్టు కెప్టెన్సీ నుండి ఏ విధంగా అయితే తప్పుకోవాల్సి వచ్చిందో.. ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి నుండి కూడా అలానే తప్పుకున్నాడు గంగూలీ.
Advertisement
అయితే ఈసారి కూడా బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని ఎక్కాలని గంగూలీ బాగానే ప్రయత్నించాడు. కానీ బోర్డు పెద్దలు దాదా ఆశాలకు గండి కొట్టారు అనేది నిజం. దాంతో అసలు దాదా ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ కూడా వేయలేదు. అయితే ఆ పదవికి ఒక్కే ఒక్క నామినేషన్ అనేది రోజర్ బిన్నీ వేయగా.. ఈరోజు అధికారికంగా ఆయనే బోర్డు పగ్గాలు అనేవి అందుకున్నారు.
Advertisement
ఇక తన పదవి అనేది పోవడం పట్ల దాదా ఎలా స్పందిస్తాడో అని అందరూ అనుకుంటే.. చాలా కూల్ గా మాట్లాడి అందరికి ఆశ్చర్యం అనేది కలిగించాడు దాదా. కొత్తగా ప్రెసిడెంట్ అయిన రోజర్ బిన్నీకి అలాగే కొత్త పాలక వర్గానికి కంగ్రాట్స్. ప్రస్తుతం భారత జట్టు వరుస విజయాలతో వెళ్తుంది. ఇది ఇలానే ఉండాలి. ఇక బోర్డు ఇప్పుడు సమర్థుల చేతిలోకి వెళ్ళింది. కాబట్టి.. భవిష్యత్ లో భారత క్రికెట్ అనేది ఇంకా బలపడుతుంది అని నేను భావిస్తున్నాను అంటూ సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :