Home » ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ లో ప్రతి ఏడాది మాదిరిగానే అద్భుతమైన యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. అందులో అందరికంటే ఎక్కువ పేరు సంపాదించుకుంది మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ ఉమ్రా మాలిక్. ప్రతి మ్యాచ్ లో 150 కీ.మీకీ వేగం తగ్గకుండా బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాలా మంది భారత మాజీ ఆటగాళ్లు అయితే… మాలిక్ ను వెంటనే టీం ఇండియాలోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్ జట్టులోకి మాలిక్ ను తీసుకోవాలి అని అంటున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు లిస్ట్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో దాదా మాట్లాడుతూ… ఈ ఐపీఎల్ 2022 లో బౌలర్లు నన్ను బాగా ఆకట్టుకుంటున్నారు. ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, నటరాజన్ లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటర్లను అద్భుతంగా అడ్డుకుంటున్నారు. ఉమ్రాన్ మాలిక్ తప్పకుండ భారత జట్టులోకి వస్తాడు. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో 150 కంటే ఎక్కువ వేగంగా బంతులు వేయగల బౌలర్లను వేళ మీద లేకించవచ్చు. అందులో ఉమ్రాన్ కూడా ఒక్కడు. అందువల్ల మేము అతడిని చాలా జాగ్రత్తగా వాడుకుంటాం అని గంగూలీ అన్నారు.

Advertisement

అదే విధంగా ఈ ఐపీఎల్ 2022 లో పూర్తింగా విఫలమవుతున్న భారత స్టార్ బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలకు మద్దతుగా నిలిచాడు గంగూలీ. వారి ఫామ్ పైన మాట్లాడుతూ… కోహ్లీ, రోహిత్ ఇద్దరు చాలా గొప్ప బ్యాటర్లు. ఇక వారి ఫామ్ పైన నాకు ఏ భాధ లేదు. ఎందుకంటే ప్రపంచ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఆలోగా వారు మళ్ళీ తమ ఫామ్ లోకి వస్తారు అని తాను నమ్ముతున్నట్లు గంగూలీ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

అంబటి రాయుడు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచిన చెన్నై..!

కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?

Visitors Are Also Reading